PBKS vs RCB: పంజాబ్‌పై విజయంతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 17, 2026
07:29 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్లేఆఫ్స్‌కి దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆర్సీబీ ఘన విజయాన్ని నమోదు చేసింది. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ బ్యాటింగ్‌లో శశాంక్ సింగ్ 56 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, స్టాయినిస్ 37 పరుగులు, కనోలి 37 పరుగులు, సూర్యాంశ్ 35 పరుగులు చేశారు.
వివరాలు
ఆరో పరాజయాన్ని చవిచూసిన పంజాబ్
ఆర్సీబీ బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టగా, సలామ్ దార్ 3 వికెట్లు సాధించాడు. హేజిల్‌వుడ్, సుయాశ్ శర్మ, రొమారియో షెఫర్డ్ తలో ఒక వికెట్ చొప్పున తీసుకున్నారు. ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూసింది.