LOADING...
RCB: తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఆర్సీబీ పరిహారం 

RCB: తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు ఆర్సీబీ పరిహారం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2025
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయోత్సవాల సందర్భంలో చిన్నస్వామి స్టేడియంలో చోటుచేసుకున్న తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 11 మంది కుటుంబాలకు ఆ జట్టు యాజమాన్యం ఆర్థిక సాయంతో ముందుకొచ్చింది. బాధిత కుటుంబాల ప్రతి ఒక్కరికీ రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ఆర్సీబీ ప్రకటించింది. దీనిని సంస్థ తమ అధికారిక ఎక్స్‌ (పూర్వం ట్విట్టర్‌) ఖాతాలో వెల్లడించింది. దీనితోపాటు, ఈ సంఘటనలో గాయపడినవారికి వైద్య సహాయం అందించేందుకు "ఆర్సీబీ కేర్స్‌" పేరిట నిధుల సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. మరోవైపు, ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తొక్కిసలాట మృతులకు ఆర్థిక సాయం