
IPL : ఆర్బీబీలోకి న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ ఎంట్రీ.. ఖుషీగా ఆర్సీబీ ఫ్యాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
గాయం కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుకు ఇంగ్లాండ్ స్టార్ ఆలౌరౌండర్ విల్ జాక్స్ దూరమైన విషయం తెలిసిందే.
అతని స్థానంలో న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ బ్రేస్‌వెల్‌కి అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం స్పష్టం చేసింది.
మార్చి 31న ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా జట్లు ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాయి. బంగ్లాదేశ్ జరిగిన రెండో వన్డేలో విల్ జాక్స్ గాయడటంతో మొత్తం ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. దీంతో ఆలౌరౌండర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు బ్రేస్‌వెల్ ని రూ. 1కోటీ బేస్ ధరతో ఆర్సీబీ కొనుగోలు చేసింది.
గతేడాది డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో జాక్స్‌ను రూ. 3.2 కోట్లను చెల్లించి ఆర్సీబీ కొనుగోలు చేసింది.
బ్రెస్‌వెల్
ఫామ్ లో ఉన్న న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ బ్రెస్‌వెల్
ప్రస్తుతం వన్డే, టీ20ల్లో బ్రెస్‌వెల్ మెరుగ్గా రాణిస్తున్నాడు. బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లోనూ ప్రత్యర్థుల వికెట్లు తీస్తూ సత్తా చాటుతున్నాడు. గతేడాది టీ20ల్లో బ్రెస్ వెల్ తన మొదటి ఓవర్లోనే హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. ఈ మైలురాయిని సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు.
గతేడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ నాకౌట్స్ కు చేరింది. అయితే ఆర్సీబీ రెండో క్వాలిఫైయర్‌లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.
ఆర్సీబీ ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈసారి ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు