RCB vs SRH: హెన్రిచ్ క్లాసెన్ సెంచరీ; 186 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్ ఎంచుకుంది.
హెన్రిచ్ క్లాసెన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. క్లాసెన్ 51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగులతో రెచ్చిపోయాడు.
దీంతో ఎస్ఆర్‌హెచ్ తరఫున ఈ సీజన్‌లో 400 పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు.
చివరి ఓవర్‌లో హ్యారీ బ్రూక్ (27*) రాణించాడు. దీంతో ఆర్సీబీ 187 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు నిర్దేశించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆర్సీబీ లక్ష్యం 187 పరుగులు
Innings Break!@SunRisers post a total of 186/5 on the board.#RCB chase coming up shortly. Stay tuned!
— IndianPremierLeague (@IPL) May 18, 2023
Scorecard - https://t.co/stBkLWLmJS #TATAIPL #SRHvRCB #IPL2023 pic.twitter.com/lgeVymEDAk