ఆర్సీబీ ఈ సారి కచ్చితంగా కప్పు కొడుతుంది: బ్రెట్ లీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ట్రోఫీని ఎవరు సాధిస్తారో అన్న ప్రశ్నకు ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ సమాధానం ఇచ్చాడు. ఈసారి కచ్చితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రోఫీని కైవసం చేసుకుంటుందని బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు. వాళ్లు మ్యాచ్ కు మ్యచ్ కూ మంచి ఫలితాలను రాబట్టుతున్నారని, ఐపీఎల్ ట్రోఫీని ఎక్కువ శాతం ఆర్సీబీనే గెలిచే ఛాన్సు ఉందన్నారు. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచులో కోహ్లీ, డుప్లెసిస్ అద్భుత ఇన్నింగ్స్ తో ఆర్సీబీకి 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు. అయితే గుజరాత్ టైటాన్స్ తో సొంతగడ్డపై జరిగే చివరి మ్యాచులో ఆర్సీబీ గెలిస్తే ఫ్లే ఆఫ్ బెర్తు దాదాపుగా ఖాయమవుతుంది.
కోహ్లీపై జహీర్ ఖాన్ ప్రశంసలు
ఉప్పల్ స్టేడియంలో కోహ్లీ ఆడిన కొన్ని షాట్లు మాటలకు అందవని, తానెంటో మరోసారి నిరూపించే ప్రయత్నం చేశాడని, ఇప్పటికే టాప్ 4లో ఆ జట్టు నిలిచిందని, ట్రోఫీని కూడా సాధిస్తారని బ్రెట్ లీ పేర్కొన్నారు. మరోపక్క టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ కూడా ఆర్సీబీపై ప్రశంసలు కురిపించాడు. గత సీజన్లో ఆర్సీబీ ఒత్తిడితో తలొగ్గిందని, ఈ సీజన్లో ఆర్సీబీ దూకుడుగా ఆడుతోందని, తొలి రెండు ఓవర్లలోనే నాలుగైదు ఫోర్లు కొట్టిన కోహ్లీ ఏదైనా స్పెషల్ ఇన్నింగ్స్ ఆడతాడని భావించానని, అందుకే తగ్గట్టుగానే సెంచరీ బాదాడని పేర్కొన్నారు. కోహ్లీ సెంచరీ కొట్టడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఈసారి కప్ తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.