LOADING...
TheRajasaab : రెబల్ సాబ్ ప్రీ రిలీజ్ డేట్, లొకేషన్ ఫిక్స్! ఎప్పుడంటే? 
రెబల్ సాబ్ ప్రీ రిలీజ్ డేట్, లొకేషన్ ఫిక్స్! ఎప్పుడంటే?

TheRajasaab : రెబల్ సాబ్ ప్రీ రిలీజ్ డేట్, లొకేషన్ ఫిక్స్! ఎప్పుడంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 23, 2025
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్, రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్ అయ్యాయి. ఇక సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఈవెంట్‌కు ప్రభాస్ వస్తాడని కన్ఫామ్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈవెంట్ డేట్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ 27న ఈవెంట్ నిర్వహణకు ప్లాన్ చేస్తున్నారు.

Details

మరో ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్

అయితే, వెన్యూ ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ, హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఈ ఈవెంట్ ఉండే ఛాన్స్ ఉంది. రేపో మాపో మేకర్స్ నుంచి ఈ విషయంలో అధికారిక ప్రకటన రానుంది. ఈవెంట్‌లో మరొక ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తుంది. గతంలో వచ్చిన ట్రైలర్‌లో డార్లింగ్ వింటేజ్ వైబ్‌తో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఇప్పుడు సెకండ్ ట్రైలర్ సినిమా పై మరింత అంచనాలు పెంచేలా కట్ చేస్తున్నట్టుగా టాక్. ఇక్కడితో సినిమా హైప్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లేలా మారుతి ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement