Kas Naidu: మహిళా కామెంటేటర్‌గా రికార్డులు.. తెలుగు అమ్మాయి 'కాస్ నాయుడు' అందరికీ స్ఫూర్తి!
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ కామెంటరీ అనగానే ముందుగా మగవారి గొంతులు గుర్తుకొస్తాయి. కానీ 'కాస్ నాయుడు' అనే మహిళ ఈ రంగంలో రాణించడం విశేషం. ఆమె దక్షిణాఫ్రికా తొలి అంతర్జాతీయ కామెంటేటర్‌గా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్ వరల్డ్‌కప్‌లలోనూ కామెంటేటర్‌గా వ్యవహరించి, తన చిరకాల కలను నెరవేర్చారు. అతి ప్రత్యేకం ఏమిటంటే కాస్ తెలుగమ్మాయి కూడా.
Details
కుటుంబం, తెలుగు నాటు అనుబంధం
కాస్ నాయుడు తల్లి భగవతి, తండ్రి సన్నాసి నాయుడు. ఆమెకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. తాతలు కాలంలోనే కుటుంబం దక్షిణాఫ్రికాకు వలస వెళ్ళింది. అయితే తల్లివైపు తాతయ్యది అనకాపల్లి సమీపంలోని వెంకోజీపాలెం. ఈ నేపథ్యంలో ఆమె తెలుగు సంస్కృతి, భాషతో అనుబంధాన్ని పెంచుకున్నారు. కాస్ పుట్టిపెరిగిన స్థలం దక్షిణాఫ్రికా, డర్బన్. చిన్నప్పటి నుండి క్రీడల పట్ల ఆసక్తి, నెట్‌బాల్, రన్నింగ్‌లో ప్రతిభ చూపించారు.
Details
జర్నలిజం, కామెంటరీ ప్రస్థానం
కాస్ 14 ఏళ్ల వయసులో 'డోన్నా సిమండ్స్' చూసి కామెంటరీ వైపు దారితీసింది. జర్నలిజం చదివి, రేడియో, టీవీ స్పోర్ట్స్ ప్రొడ్యూసర్‌గా పనిచేసి అనుభవం సంపాదించారు. 2003లో ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్‌లో టీవీ హోస్ట్‌గా అవకాశం, 2006లో హాంకాంగ్‌లో అంతర్జాతీయ కామెంటరీ ప్రారంభం. ఇప్పటివరకు నాలుగు వరల్డ్‌కప్‌లు, భారత-సౌతాఫ్రికా టూర్లు, ఇతర లీగ్‌లలో కామెంటరీ అందించారు. 2023 క్రికెట్ వరల్డ్‌కప్‌లో ఐసీసీ ప్యానల్‌లోనూ పాల్గొన్నారు. కాస్ మహిళల ఆట ప్రోత్సాహానికి 'జీస్పోర్ట్' అనే సంస్థను స్థాపించి, మిథాలీ రాజ్, సనామీర్‌లతో హిస్టార్టిక్ విమెన్ కామెంటరీ ప్యానెల్‌లో పాల్గొన్నారు. చివరికి భారత్‌లో మహిళల క్రికెట్ వరల్డ్‌కప్‌లో కామెంటరీ చేసే కలను నెరవేర్చారు.
Details
ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాలివే
కాస్ ఎప్పుడూ క్రికెట్ ఆడలేదు. అందువల్ల, ఆమె కామెంటరీ చేసే సామర్థ్యంపై అనుమానాలు ఎదురయ్యాయి. కానీ హర్షాభోగ్లే ద్వారా నైపుణ్యాన్ని పెంచి, తన ప్రతిభతో సవాళ్లను దాటేశారు. 2006లో రేడియోలో మహిళల స్పోర్ట్స్ కవరేజ్ తక్కువని గమనించి, భర్త రైక్‌తో కలిసి 'జీస్పోర్ట్4గర్ల్స్' వెబ్‌సైట్ ప్రారంభించి, మహిళా అథ్లెట్లను ప్రోత్సహించారు. వ్యక్తిగత జీవితం, దృఢ సంకల్పం కాస్ ముగ్గురు పిల్లల తల్లి. ఆమెని పేషన్, కష్టానికి సిద్ధం, మనమీద నమ్మకం అని చెప్పొచ్చు. మహిళల క్రికెట్‌లో కనిపించని కొత్త మార్గంలో అడుగుపెట్టిన ఆమె తన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. కాస్ నాయుడు విజయం, స్ఫూర్తి అనేకరికి మార్గదర్శకంగా నిలిచింది.