రిషబ్ పంత్ ఊపిరి నిలబడింది
క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు రిషబ్ పంత్ యాక్సిడెంట్ వార్తపై తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో మెసేజ్ లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం టీమిండియా డాషింగ్ క్రికెటర్ రోడ్డు ప్రమాదానికి గురై, డెహ్రడూన్ లోని మాక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం న్యూఢిల్లీకి వెళుతన్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. కారులోంచి పంత్ దూకకపోతే ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానిక అధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం రిషబ్ పంత్ ఆరోగ్యంపై డెహ్రాడూన్ వైద్యులు స్పందించారు. అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.
పంత్ తలకి, కాలికి తీవ్ర గాయాలు
యాక్సిడెంట్ లో పంత్ తల, కాలికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై ఓ డాక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం పంత్ కాలికి ప్రాక్చర్ అయింది. ప్లాస్టిక్ సర్జరీ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. డివైడర్ ను ఢీకొన్న ఘటనలో పంత్ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో నుంచి రిషబ్ వెంటనే దూకడంతో ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే పెను ప్రమాదం సంభవించేంది. అయితే బంగ్లాదేశ్ పర్యటన ముగించుకున్న రిషబ్ కు శ్రీలంక జరిగే సిరీస్ లో విశ్రాంతినిచ్చారు.