The Hundred Women's 2026 Auction: రిచా ఘోష్‌కు రూ.61 లక్షలు.. దీప్తి శర్మకు రూ.34 లక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌లో జరగనున్న 'హండ్రెడ్' టోర్నమెంట్ (ఒక్కో ఇన్నింగ్స్‌కు 100 బంతులు)లో భారత్ నుంచి నలుగురు మహిళా క్రికెటర్లు పాల్గొననున్నారు. బుధవారం నిర్వహించిన వేలంలో భారత జట్టు వికెట్ కీపర్ రిచా ఘోష్‌ను మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ జట్టు 50,000 పౌండ్లకు (సుమారు రూ. 61 లక్షలు) కొనుగోలు చేసింది. అలాగే ఆల్‌రౌండర్ దీప్తి శర్మను సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు 27,500 పౌండ్లకు (దాదాపు రూ. 34 లక్షలు) దక్కించుకుంది.
వివరాలు
మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ జట్టులో స్మృతి
ఇక వేలానికి ముందుగానే భారత జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌లను ఆయా ఫ్రాంచైజీలు రీటెయిన్ చేసుకున్నాయి. స్మృతి మంధానను మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ జట్టు 90,000 పౌండ్లకు (సుమారు రూ. 1 కోటి 11 లక్షలు) కొనసాగించగా... జెమీమా రోడ్రిగ్స్‌ను సదరన్ బ్రేవ్ జట్టు 60,000 పౌండ్లకు (సుమారు రూ. 74 లక్షలు) తమ వద్దే ఉంచుకుంది. ఈ వేలంలో భారత్ నుంచి మొత్తం 14 మంది మహిళా క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే వారిలో కేవలం ఇద్దరినే ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడం గమనార్హం.