Sanju Samson: సంజు శాంసన్ వల్లే భారత్ టీ20 వరల్డ్‌కప్ గెలిచింది..రికీ పాంటింగ్ షాకింగ్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికాతో జరిగిన పోరులో భారత్ ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో మిగతా మ్యాచ్‌లను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కలిసి సంజు శాంసన్‌ను తుది జట్టులో చేర్చారు. ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ సంజు అద్భుత ప్రదర్శనతో జట్టుకు కీలకంగా మారాడు. టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణయమే చివరికి భారత్‌కు టైటిల్ అందించిందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
వివరాలు
ధైర్యం చెప్పడం ఎంతో అవసరం
ఇషాన్ కిషన్‌ను బ్యాటింగ్ క్రమంలో కిందకు మార్చి, సంజు శాంసన్‌ను మళ్లీ ఓపెనర్‌గా పంపడం చాలా కీలక నిర్ణయమని పాంటింగ్ పేర్కొన్నాడు. ఆ మార్పు జట్టుకు అనుకూల ఫలితాలు ఇచ్చిందని ఆయన చెప్పాడు. ఒక ఆటగాడిగా, కోచ్‌గా, మాజీ కెప్టెన్‌గా తన అనుభవం ప్రకారం, ఆటగాడికి నమ్మకం కల్పించడం అత్యంత ముఖ్యం అని సూచించాడు. ఆటగాడిని ప్రోత్సహిస్తూ 'మేము నిన్ను విశ్వసిస్తున్నాం, ఈ బాధ్యతను నువ్వు సమర్థంగా నిర్వహించగలవు' అని ధైర్యం ఇవ్వడం అవసరమని ఆయన వివరించాడు.
వివరాలు
భారత్ దూసుకెళ్తోంది..
ఇదే సందర్భంలో వైట్‌బాల్ క్రికెట్‌లో భారత జట్టు ప్రదర్శనపై కూడా పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. టీ20లతో పాటు వన్డేల్లో కూడా భారత్ స్థిరంగా మంచి ఆటతీరు కనబరుస్తోందన్నారు. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్‌లలో తన సామర్థ్యాన్ని నిరూపిస్తోందని ఆయన వెల్లడించాడు.