Page Loader
Rinku Singh: ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే 2వ టెస్ట్ మ్యాచ్‌కు రింకూ సింగ్ !
Rinku Singh: ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే 2వ టెస్ట్ మ్యాచ్‌కు రింకూ సింగ్ !

Rinku Singh: ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే 2వ టెస్ట్ మ్యాచ్‌కు రింకూ సింగ్ !

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2024
10:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే అనధికారిక నాలుగు రోజుల టెస్టు కోసం రైజింగ్ ఇండియా బ్యాటర్ రింకూ సింగ్‌ను ఇండియా ఎ జట్టులో చేర్చినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మంగళవారం తెలిపింది. ఇప్పటిదాకా,రింకూ సింగ్ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ లలో.. 65 ఇన్నింగ్స్‌లలో 57.57 సగటుతో 3109 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టీమిండియా తరఫున టీ20ల్లో రింకూ అద్భుతంగా ఆడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ముగిసిన అఫ్గాన్ సిరీస్‌లో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు 15 టీ20 ఆడిన రింకూ 356 రన్స్ చేశాడు.అత్యధిక స్కోర్ 69 నాటౌట్. ఇక రెండు వన్డేల్లో 55 పరుగులు చేశాడు.

Details 

ఇండియా'A' జట్లు ఇదే..

శనివారం ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 2వ నాలుగు రోజుల టెస్టు జనవరి 24న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభమవుతుంది. India 'A' squad for the 2nd multi-day match: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, విద్వాత్ కావరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాష్ దీప్, యశ్ దయాల్, రింకూ సింగ్