LOADING...
IPL 2026: ఐపీఎల్‌కు ముందే కేకేఆర్‌లో మార్పులు..వైస్‌కెప్టెన్‌గా రింకూ సింగ్
ఐపీఎల్‌కు ముందే కేకేఆర్‌లో మార్పులు..వైస్‌కెప్టెన్‌గా రింకూ సింగ్

IPL 2026: ఐపీఎల్‌కు ముందే కేకేఆర్‌లో మార్పులు..వైస్‌కెప్టెన్‌గా రింకూ సింగ్

వ్రాసిన వారు Moogati Shabari
Mar 25, 2026
11:42 am

ఈ వార్తాకథనం ఏంటి

మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌గా గుర్తింపు పొందిన రింకూ సింగ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌గా నియమించింది. జట్టులో అతని స్థిరమైన ప్రదర్శన, ఒత్తిడి పరిస్థితుల్లో ఆడగల సామర్థ్యం ఈ బాధ్యతకు కారణమయ్యాయి. ఈ నిర్ణయాన్ని కేకేఆర్‌ తమ ఎక్స్‌ వేదికలో ప్రకటించింది. దేవుని ప్రణాళికలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైందని పోస్టులో రాసుకొచ్చింది. 2018లో కోల్‌కతా జట్టులోకి వచ్చిన రింకూ, క్రమంగా జట్టులో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా చివరి ఓవర్లలో అతను చూపిన దూకుడు బ్యాటింగ్‌ జట్టుకు అనేక విజయాలను అందించింది. మ్యాచ్‌ను తుదిదశలో మలుపు తిప్పగల ఆటగాడిగా అతనికి మంచి గుర్తింపు ఉంది. యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తూ, జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో కూడా అతని పాత్ర విశేషం.

వివరాలు 

అంచెలంచెలుగా ఎదిగిన రింకూ

దేశీయ క్రికెట్‌లో కూడా రింకూ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. 2024-25 విజయ్‌ హజారే ట్రోఫీలో ఉత్తర్‌ప్రదేశ్‌ జట్టుకు నాయకత్వం వహించడం ద్వారా నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు. ఈ అనుభవం అతడికి అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్‌లలో కూడా ఉపయోగపడనుంది. అజింక్య రహానే సారథ్యంలో కోల్‌కతా జట్టు సమతుల్యంగా కనిపిస్తోంది. అనుభవం, యువశక్తి కలయికతో ఉన్న ఈ జట్టు, ఈ సీజన్‌లో బలమైన పోటీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 29న ముంబయి జట్టుతో జరగనున్న మ్యాచ్‌తో ఐపీఎల్‌ పోరును ప్రారంభించనుంది. రింకూ సింగ్‌ వైస్‌ కెప్టెన్‌గా నియమితుడవడంతో జట్టులో నాయకత్వ బాధ్యతలు మరింత పటిష్టం అవుతాయని భావిస్తున్నారు. అతని ప్రదర్శనతో పాటు నాయకత్వ నైపుణ్యం కూడా ఈ సీజన్‌లో కీలక పాత్ర పోషించనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్: 

Advertisement