LOADING...
Rinku Singh: రింకు సింగ్‌ ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌.. పోలీసులకు ఫిర్యాదు
రింకు సింగ్‌ ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌.. పోలీసులకు ఫిర్యాదు

Rinku Singh: రింకు సింగ్‌ ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌.. పోలీసులకు ఫిర్యాదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 06, 2026
02:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్‌కు చెందిన ఫేస్‌బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అలీగఢ్ పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. బిజీ క్రికెట్ షెడ్యూల్‌ల కారణంగా కొన్ని నెలలుగా రింకు సింగ్ తన ఫేస్‌బుక్ ఖాతాను యాక్సెస్ చేయలేదు. ఇదే అవకాశంగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు ఆ ఖాతాను హ్యాక్ చేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఖాతా ఎప్పుడు హ్యాకింగ్‌కు గురైందనే అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు.

Details

దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ సెల్

ఈ విషయాన్ని గుర్తించిన రింకు సింగ్ సోదరుడు సోను సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ సెల్ దర్యాప్తు చేపట్టింది. హ్యాక్ అయిన ఖాతా ద్వారా ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేదా మోసాలు జరిగాయా? లేదా? అన్న కోణంలో కూడా అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలిపారు.

Advertisement