
Rinku Singh: ఆలయ నిర్మాణానికి రింకూ సింగ్ భారీ విరాళం.. ప్రశంసలతో ముంచెత్తిన నెటిజన్లు
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రీజులో భారీ సిక్సులతో విరుచుపడటం రింకూకు వెన్నతో పెట్టిన విద్య.
బౌలర్ ఎవరైనా బాదుడే అన్నట్లుగా అతడి బ్యాటింగ్ ఉంటుంది.
తన బ్యాటింగ్ స్టైల్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు.
ఈ ఏడాది మెగా లీగ్‌లో యష్ దయాళ్ వేసిన ఆఖరి ఓవర్లో ఐదు సిక్సులు కొట్టి, ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. తాజాగా రింకూ సింగ్ ఓ మంచి పని చేసి అభిమానుల మనసుల్ని గెలుచుకున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని కమలాపూర్‌లో ఓ ఆలయ నిర్మాణానికి రూ. 11 లక్షలు విరాళంగా ప్రకటించాడు. దీంతో అతడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Details
పిల్లల కోసం రూ. 50 లక్షలతో సదుపాయాలు
గతంలో రింకూ సింగ్ అలీఘర్‌లో పిల్లల కోసం దాదాపు రూ.50 లక్షలతో అవసరమైన సౌకర్యాలను కల్పించిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఐపీఎల్‌లో 14 మ్యాచులాడిన రింకూ సింగ్ 474 పరుగులు చేశాడు.
ఐపీఎల్ ప్రదర్శన కారణంగా ఏషియన్ గేమ్స్ కోసం టీమిండియా యువ జట్టులో స్థానం సంపాదించాడు. ఏషియన్ గేమ్స్ లో కూడా రింకూ అద్భుతంగా రాణించాడు.
ఇక లెఫ్టాండ్ బ్యాటర్ రింకూ సింగ్‌కు దైవ భక్తి ఎక్కువేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.