
Rishabh Pant: టీమిండియాకు గుడ్ న్యూస్.. బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగిన రిషబ్ పంత్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ బ్యాట్ పట్టుకొని మైదానంలోకి అడుగుపెట్టాడు.
కారు ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ తొలిసారి బ్యాట్ పట్టాడు. పంత్ ఓ లోకల్ మ్యాచులో బ్యాటింగ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను చూసి పంత్ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.
పంత్ సాధారణ స్థితికి చేరుకొని మళ్లీ భారత్ తరుపున ఆడాలని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజున పంత్ JSW ఫౌండరేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హజరయ్యారు.
Details
మైదానంలో చురుగ్గా కదిలిన రిషబ్ పంత్
మొదట ఆ కార్యక్రమంలో ప్రసంగించిన పంత్, కాసేపటి తర్వాత బ్యాట్ ను అందుకున్నాడు.
మైదానంలో వేగంగా కదలటమే కాకుండా, మునుపటిలాగా అలవోకగా సిక్సులు బాదేశాడు. ఫ్రంట్ ఫుట్‌లో ఎక్ట్రా కవర్ మీదుగా పంత్ కొట్టిన సిక్స్ చూసి ప్రేక్షకులు కేరింతలు కొట్టారు.
ఈ వీడియో చూశాక పంత్ రీఎంట్రీకి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉండదని చెప్పొచ్చు.
ఈ నేపథ్యంలోనే పంత్ వచ్చే ఏడాది ప్రారంభంలోనే తిరిగి తన ఆటను మొదలు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సిక్సర్ బాదిన రిషబ్ పంత్
@RishabhPant17 back in the ground 😍😍 #rishabhpant pic.twitter.com/M0r1tq9tzl
— Md Israque Ahamed (@IsraqueAhamed) August 16, 2023