LOADING...
Rishabh Pant: మళ్లీ గాయపడ్డ రిషబ్ పంత్.. సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌లో ఆడేనా?
మళ్లీ గాయపడ్డ రిషబ్ పంత్.. సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌లో ఆడేనా?

Rishabh Pant: మళ్లీ గాయపడ్డ రిషబ్ పంత్.. సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌లో ఆడేనా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2025
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ గతంలో తీవ్ర గాయం నుంచి కోలుకొని సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్న వేళ, తాజాగా మరోసారి గాయపడ్డారు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో భారత్ ఏ, సౌతాఫ్రికా ఏ జట్ల మధ్య జరిగిన అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా, పంత్ మూడు బంతుల్లో మూడు సార్లు బంతి తగిలి గాయపడ్డాడు. తీవ్రమైన నొప్పి కారణంగా అతను రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాల్సి వచ్చింది. ఈ ఘటనతో నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌లో పంత్ ఆడటంపై సందేహాలు మరింత పెరిగాయి.

Details

త్‌షేపో మోరెక్ బౌలింగ్ లో గాయం

మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ పంత్, సౌతాఫ్రికా ఏ పేస్ బౌలర్ త్‌షేపో మోరెక్ వరుసగా వేయించిన బంతులకు దెబ్బతిన్నాడు. మొదట ఒక బంతి హెల్మెట్‌కు తగిలి, తరువాత ఎడమ మోచేతికి, చివరగా పొట్టకు బంతి తగిలింది. తీవ్రమైన నొప్పి కారణంగా కోచ్ హృషికేష్ కనిత్కర్ ఫిజియో సలహా మేరకు పంత్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వదిలాడు. రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 22 బంతుల్లో 17 పరుగులు (2 ఫోర్లు, 1 సిక్స్) చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 20 బంతుల్లో 24 పరుగులు చేశాడు. గతంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో పంత్ కాలి బొటనవేలికి ఫ్రాక్చర్ పొందినట్లు తెలిసిందే.

Details

నవంబర్ 14న సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ తో ప్రారంభం

ఆ గాయం నుంచి కోలుకుని, దాదాపు మూడున్నర నెలల తర్వాత టెస్ట్ సిరీస్‌కు తిరిగి జట్టులో చేరడానికి సిద్ధమవుతున్న పంత్, ఇప్పుడు వచ్చిన కొత్త గాయాల కారణంగా నవంబర్ 14 నుండి సౌతాఫ్రికాతో ప్రారంభం కానున్న టెస్ట్‌లో తొలి మ్యాచ్‌కు ఫిట్‌ అవుతాడా అనే అనుమానాలు ఏర్పడినాయి. సిరీస్ ప్రారంభానికి ఇంకా కొంత సమయం ఉన్నందున, పంత్ పూర్తి విశ్రాంతి తీసుకుని ఫిట్‌నెస్ సాధిస్తేనే టీమిండియాలోకి చేరే అవకాశం ఉంది. ప్లేయింగ్ ఎలెవెన్ మ్యాచ్ రోజు మాత్రమే ప్రకటించబడుతుంది.

Details

మొదటి ఇన్నింగ్స్ లో 255 పరుగులు

ఈ అనధికారిక టెస్ట్‌లో ఇండియా-ఏ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయింది. ఇండియా-ఏ మొదటి ఇన్నింగ్స్ 255 పరుగులకు ఆలౌటయ్యగా, సౌతాఫ్రికా ఏ 221 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ స్కోరు లేకుండా అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ (27), సాయి సుదర్శన్ (23), దేవదత్ పడిక్కల్ (24) కూడా స్వల్ప స్కోర్లకే అవుట్ అయ్యారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో