Rishabh Pant: క్రికెట్ ప్రపంచంలో చర్చలకు తెరలేపిన రిషబ్ పంత్ ట్వీట్!
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తన సోషల్ మీడియాలో ఓ అసక్తికరమైన పోస్టు చేశారు. ఇది అభిమానులను అశ్చర్యపరిచింది. 'వేలానికి వెళ్తే నేను అమ్ముడుపోతానా? లేదా? అమ్ముడుపోతే ఎంతకు పోవచ్చు?' అని ప్రశ్నించారు. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్ట్ వల్ల అభిమానులు పంత్ భవిష్యత్తుపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అతను వేరే జట్టుకి మారిపోతాడా అన్న ఊహగానాలు మొదలయ్యాయి. ఈ పోస్టు ఐపీఎల్ మెగా వేలానికి ముందు హైప్ పెంచే విధానం కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఐపీఎల్లో రిషబ్ పంత్ కు మంచి ట్రాక్ రికార్డు
ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం పంత్‌ను తమ జట్టులో కొనసాగించాలని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది, ఎందుకంటే అతడిని వదిలివేస్తున్నట్టు ఎలాంటి సంకేతాలు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఐపీఎల్‌లో రిషబ్ పంత్ మాత్రం మొదటి సారి ఢిల్లీ క్యాపిటల్స్‌కు మాత్రమే ప్రతినిధ్యం వహించాడు. రిషబ్ పంత్‌కి ఐపీఎల్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఇప్పటివరకు 111 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన పంత్ 3,284 పరుగులు సాధించాడు. ఆయన స్ట్రైక్ రేటు 148.93గా ఉంది. ఇందులో ఒక సెంచరీ, 18 హాఫ్ సెంచరీలున్నాయి. గత సీజన్‌లో, ఢిల్లీ క్యాపిటల్స్ పంత్‌ను రూ. 16 కోట్లకు సంతకం చేసింది. గత ఐపీఎల్ సీజన్‌లో పంత్, జట్టుకు అద్భుత ప్రదర్శన ఇచ్చినా, ఆ జట్టు ఆరవ స్థానంలో నిలిచింది.