Loading...
Kaviya Maran: అబ్రార్ తర్వాత రిషాద్.. కావ్య మారన్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్!
అబ్రార్ తర్వాత రిషాద్.. కావ్య మారన్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్!

Kaviya Maran: అబ్రార్ తర్వాత రిషాద్.. కావ్య మారన్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 07, 2026
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌ రైజర్స్ హైదరాబాద్ అధినేత్రి కావ్య మారన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల 'ద హండ్రెడ్' లీగ్ కోసం పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసి విమర్శలు ఎదుర్కొన్న ఆమె, ఇప్పుడు దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (SA20) కోసం బంగ్లాదేశ్ యువ లెగ్ స్పిన్నర్ రిషాద్ హుస్సేన్‌ను జట్టులోకి తీసుకుని మరోసారి చర్చనీయాంశంగా మారారు.

వివరాలు

గ్లోబల్ లీగ్‌ల్లో సన్‌గ్రూప్ దూకుడు

ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రికెట్ లీగ్‌ల్లో సన్‌గ్రూప్ తన ప్రస్థానాన్ని విస్తరిస్తోంది.

ఈ ఏడాది లండన్‌లో జరిగే 'ద హండ్రెడ్' టోర్నీ వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడంతో కావ్య మారన్ నిర్ణయం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

టీమిండియా ఆటగాళ్లను గతంలో మైదానంలో గేలి చేసిన చరిత్ర ఉన్న అబ్రార్‌ను జట్టులోకి తీసుకోవడంపై భారత క్రికెట్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

వివరాలు

ఇప్పుడు రిషాద్ హుస్సేన్‌కు అవకాశం

ఆ వివాదం పూర్తిగా చల్లారకముందే, SA20 లీగ్ 2027 సీజన్ కోసం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు బంగ్లాదేశ్ యువ స్పిన్నర్ రిషాద్ హుస్సేన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఆ దేశ ఆటగాళ్లను బహిష్కరించాలని కొందరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో 'ముస్తాఫిజుర్ రెహమాన్'‌ను 'కోల్‌కతా నైట్‌రైడర్స్' జట్టు పక్కన పెట్టిన విషయం కూడా చర్చనీయాంశమైంది.

అలాంటి పరిస్థితుల్లో రిషాద్ హుస్సేన్‌ను జట్టులోకి తీసుకోవడం వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు.

ADVERTISEMENT

వివరాలు

భారీ మొత్తానికే ఒప్పందం?

SA20 టోర్నీ నిబంధనల ప్రకారం ఆటగాళ్లతో కుదుర్చుకున్న ముందస్తు ఒప్పందాల విలువను అధికారికంగా వెల్లడించరు.

దీంతో రిషాద్ హుస్సేన్‌కు చెల్లించిన ఖచ్చితమైన మొత్తం బయటకు రాలేదు. అయితే అతడిని జట్టులోకి తీసుకునేందుకు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు సమాచారం.

టీ20 ఫార్మాట్‌లో ప్రతిభావంతుడైన లెగ్ స్పిన్నర్‌గా గుర్తింపు పొందిన రిషాద్, SA20 లీగ్‌లో అవకాశం దక్కించుకున్న తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా నిలిచాడు.

ADVERTISEMENT

వివరాలు

సోషల్ మీడియాలో మళ్లీ విమర్శలు

కావ్య మారన్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

భారత అభిమానుల సెంటిమెంట్లను పక్కనపెట్టి పొరుగు దేశాల ఆటగాళ్లకు వరుసగా అవకాశాలు ఇవ్వడంపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

గత వివాదం నుంచి పాఠాలు నేర్చుకోకుండా మరోసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైన విధానం కాదంటూ విమర్శలు చేస్తున్నారు.

మరోవైపు, ఆటగాళ్ల ఎంపిక ప్రతిభ ఆధారంగానే జరుగుతుందని, దాన్ని రాజకీయ లేదా జాతీయ భావోద్వేగాలతో ముడిపెట్టకూడదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT