Riyan Parag: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉండగా, రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టుకు కొత్త కెప్టెన్‌గా రియాన్ పరాగ్‌ను నియమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని జట్టు తమ సోషల్ మీడియా వేదికల ద్వారా వెల్లడించింది. ఇప్పటివరకు జట్టును నడిపించిన సంజు శాంసన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
వివరాలు
అంచనాలకు భిన్నంగా రియాన్ పరాగ్‌కు అవకాశం
ఈ నేపథ్యంలో కొత్త సారథి ఎంపికపై చర్చలు జోరుగా సాగాయి. రవీంద్ర జడేజా లేదా యశస్వి జైస్వాల్‌లలో ఎవరో ఒకరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారని క్రికెట్ వర్గాలు భావించాయి. అయితే, అందరి అంచనాలకు భిన్నంగా రియాన్ పరాగ్‌కే అవకాశం దక్కింది. గత ఐపీఎల్ సీజన్‌లో కూడా సంజు గైర్హాజరు అయిన సందర్భాల్లో కొన్ని మ్యాచ్‌లలో రియాన్ పరాగ్ జట్టును సమర్థంగా నడిపించాడు. ఆ అనుభవమే ఈసారి అతడికి పూర్తి స్థాయి కెప్టెన్‌గా అవకాశం కల్పించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్
Royals fam, it’s time to get behind your new Captain! 💪💗 pic.twitter.com/OjodsT0fu5
— Rajasthan Royals (@rajasthanroyals) February 13, 2026