Page Loader
Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ జోడీ 
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ జోడీ

Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన రోహన్ బోపన్న, మాథ్యూ ఎబ్డెన్ జోడీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 25, 2024
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

రోహన్ బోపన్న,మాథ్యూ ఎబ్డెన్ రాడ్ లావర్ ఎరీనాలో ZZ జాంగ్ , టోమస్ మచాక్‌లను ఓడించి వారి మొట్టమొదటి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు చేరుకున్నారు. క్వార్టర్-ఫైనల్‌లో విజయం సాధించిన తర్వాత నంబర్ 1 ర్యాంక్ పురుషుల డబుల్స్ జోడీగా నిలిచిన బోపన్న,ఎబ్డెన్, 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకోవడానికి జాంగ్ , మచాక్‌ల కఠినమైన పరీక్షను అధిగమించారు. ఈ ఇండో-ఆస్ట్రేలియన్ జోడీ 6-3, 3-6, 7-6తో జాంగ్, మచాక్‌లను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ విజయంతో, ఈ జంట 2023 US ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా గ్రాండ్‌స్లామ్‌లలో బ్యాక్-టు-బ్యాక్ ఫైనల్స్‌కు చేరుకునట్లైంది .

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ చేరుకున్న రోహన్ బోపన్న,మాథ్యూ ఎబ్డెన్ జోడీ