Loading...
Shubman Gill - Rohit Sharma: రోహిత్ రిటైర్ అవుతానని చెప్పలేదు.. రూమర్లకు చెక్ పెట్టిన శుభ్‌మన్ గిల్!
రోహిత్ రిటైర్ అవుతానని చెప్పలేదు.. రూమర్లకు చెక్ పెట్టిన శుభ్‌మన్ గిల్!

Shubman Gill - Rohit Sharma: రోహిత్ రిటైర్ అవుతానని చెప్పలేదు.. రూమర్లకు చెక్ పెట్టిన శుభ్‌మన్ గిల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 20, 2026
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలి కాలంలో తన ఫామ్‌పై వస్తున్న విమర్శలకు భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌లతో అభిమానులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ లార్డ్స్‌లో వన్డే ఫార్మాట్‌లో సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ శతకం అనంతరం రోహిత్ అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలుకుతాడనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. అయితే ఆ వార్తలకు భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పష్టమైన సమాధానం ఇచ్చాడు.

వివరాలు

రోహిత్ అలాంటి మాట చెప్పలేదు

మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన గిల్.. ఇదే తన చివరి మ్యాచ్ అని రోహిత్ మాతో ఎప్పుడూ చెప్పలేదు. రిటైర్‌మెంట్ గురించి జట్టులో ఎలాంటి చర్చ కూడా జరగలేదు.

ఇదంతా సోషల్ మీడియాలో మొదలైన ప్రచారమేనని తేల్చి చెప్పాడు. అలాగే గత కొన్నేళ్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత జట్టుకు అందించిన సేవలను గిల్ ప్రశంసించాడు.

ఈ మ్యాచ్‌లో కూడా ఇద్దరూ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. ముఖ్యంగా రోహిత్ భాయ్ బ్యాటింగ్ అద్భుతంగా సాగిందని కొనియాడాడు.

వివరాలు

పిచ్ కష్టమైనా రోహిత్ అదరగొట్టాడు

లార్డ్స్ పిచ్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు అంత సులభంగా లేదని గిల్ వివరించాడు.

రెండో ఇన్నింగ్స్ సమయంలో పిచ్ మందకొడిగా మారింది.

ఇలాంటి పరిస్థితుల్లో పరుగులు చేయడం చాలా కష్టం. అయినప్పటికీ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని ప్రశంసించాడు.

ADVERTISEMENT

వివరాలు

ఓటమిపై గిల్ విశ్లేషణ

ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో ఎదురైన ఓటమిపై కూడా గిల్ స్పందించాడు. బౌలింగ్‌లో మేం ఇంకొన్ని పరుగులు తగ్గించాల్సింది. 45వ ఓవర్ వరకు మ్యాచ్ పూర్తిగా మా నియంత్రణలోనే ఉంది.

అయితే చివరి మూడు ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ మా చేతుల నుంచి జారిపోయింది. బ్యాటింగ్‌లో మాత్రం చివరి వరకు పోరాడుతామని గిల్ చెప్పాడు.

రోహిత్ రిటైర్‌మెంట్‌పై గిల్ చేసిన తాజా వ్యాఖ్యలతో, భారత అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

రోహిత్ శర్మను వచ్చే వన్డే ప్రపంచకప్‌లో కూడా ఆడించాలని అభిమానులు సోషల్ మీడియాలో పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

ADVERTISEMENT