LOADING...
ODI Team Of The Year: వన్డే జట్టు 2025 కెప్టెన్‌గా రోహిత్.. టాపార్డర్‌ బ్యాటర్లుగా కోహ్లీ, రూట్..!
టాపార్డర్‌ బ్యాటర్లుగా కోహ్లీ, రూట్..!

ODI Team Of The Year: వన్డే జట్టు 2025 కెప్టెన్‌గా రోహిత్.. టాపార్డర్‌ బ్యాటర్లుగా కోహ్లీ, రూట్..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 01, 2026
05:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే క్రికెట్‌లో ఫామ్‌లో ఉన్న భారత స్టార్‌ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 'ఈఎస్‌పీఎన్ వన్డే జట్టు 2025'లో చోటు సంపాదించారు. రోహిత్ శర్మ,టీమిండియాకు చాంపియన్స్ ట్రోఫీ అందించిన "హిట్‌మ్యాన్"గా కెప్టెన్‌గా ఎంపిక కాగా, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో నిలిచాడు. 2025లో వన్డేల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన 11 మంది ఆటగాళ్లతో ఈఎస్‌పీఎన్ గురువారం జట్టును ప్రకటించింది. భారత్ నుండి ఈ జట్టులో కేవలం రోహిత్, కోహ్లీలకు మాత్రమే చోటు దక్కింది. వన్డే ప్రపంచకప్ లక్ష్యంతో ముందుకెళ్తున్న భారత సీనియర్స్ రోహిత్,కోహ్లీలు ఈ జట్టులో కీలక పాత్రల్లో ఉన్నారు. కెప్టెన్-ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఎంపిక కావడంతో అతడికి జోడీగా దక్షిణాఫ్రికా క్రికెటర్ మాథ్యూ బ్రీట్‌ను ఎంపిక చేశారు.

వివరాలు 

ఆల్‌రౌండర్‌గా న్యూజిలాండ్ ఆటగాడు

మూడో స్థానంలో కోహ్లీ, నాలుగో స్థానానికి ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్‌ను ఎంపిక చేశారు. నిరుడు సెంచరీలతో ఆకట్టుకున్న వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ వికెట్ కీపర్‌గా జట్టులో చోటు దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా ఎంపిక అయ్యాడు. మిచెల్ శాంట్,మ్యాట్ హెన్రీ (న్యూజిలాండ్) బౌలింగ్ యూనిట్‌లో నిలిచారు. ఇంగ్లండ్ స్టార్ ఆదిల్ రషీద్ స్పిన్నర్‌గా, వెస్టిండీస్ జోఫ్రా ఆర్చర్, జైడెన్ సీల్స్ పేస్ బౌలర్లుగా 'వన్డే జట్టు ఆఫ్ ది ఇయర్ 2025'లో చోటు పొందారు. వన్డే జట్టు ఆఫ్ ది ఇయర్ 2025 : రోహిత్ శర్మ(కెప్టెన్),మాథ్యూ బ్రీట్జ్,విరాట్ కోహ్లీ,జో రూట్, షాయ్ హోప్(వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్,మిచెల్ శాంట్నర్,ఆదిల్ రషీద్,జోఫ్రా ఆర్చర్,మ్యాట్ హెన్రీ, జైడెన్ సీల్స్.

Advertisement