
Team India: రోహిత్ అవుట్... గిల్ ఇన్.. టెస్ట్ జట్టుకు కొత్త బాస్ రెడీ!
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా టెస్టు జట్టులో పెద్ద మార్పులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ ఇటీవలే టెస్టులకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో త్వరలో జరగబోయే ఇంగ్లాండ్ పర్యటన కోసం కొత్త నాయకత్వాన్ని సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది.
గత టూర్‌కు వైస్ కెప్టెన్‌గా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా తరచూ గాయాలపాలవుతుండటంతో, ఈసారి అతణ్ని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసే దిశగా సెలక్టర్లు తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. యువతకు అవకాశమిచ్చే దిశగా ఇది కీలకంగా భావించవచ్చు.
Details
వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్
ఇక వైస్ కెప్టెన్సీ బాధ్యతలను వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కి అప్పగించనున్నట్లు తాజా సమాచారం వెల్లడిస్తోంది.
పంత్ ప్రస్తుతం గొప్ప ఫామ్‌లో లేని విషయం వాస్తవమే అయినా, గతంలో విదేశాల్లో భారత్‌కు కొన్నే కీలక విజయాలను అందించడంలో అతడి పాత్ర ముఖ్యమైనది.
టెస్టు క్రికెట్‌లో రెగ్యులర్ సభ్యుడిగా కొనసాగుతున్న పంత్‌కి ఈ బాధ్యతలు అప్పగించాలనే ఉద్దేశంతోనే సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఇంగ్లాండ్‌లో వచ్చే నెల 20 నుంచి మొదలయ్యే అయిదు టెస్టుల సిరీస్‌తో గిల్ కెప్టెన్‌గా, పంత్ వైస్ కెప్టెన్‌గా తమ కొత్త పాత్రలు నిర్వర్తించనున్నారు.