Page Loader
వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్లో కెప్టెన్ రోహిత్ శర్మ నెలకొల్పబోతున్న రికార్డులు 
వరల్డ్ కప్ టోర్నమెంట్ లో రోహిత్ శర్మ తిరగరాయనున్న రికార్డులు

వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్లో కెప్టెన్ రోహిత్ శర్మ నెలకొల్పబోతున్న రికార్డులు 

వ్రాసిన వారు Sriram Pranateja
Oct 02, 2023
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023 దగ్గరపడుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఉన్నారు. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు, ప్రపంచ కప్ గెలిచే అవకాశం ఉందని అందరూ నమ్ముతున్నారు. అయితే జట్టుగా కప్పు గెలవడం పక్కన పెడితే, వరల్డ్ కప్ మ్యాచుల్లో రోహిత్ శర్మ కొన్ని రికార్డులను నెలకొల్పబోతున్నాడు. అవేంటో చూద్దాం. 1000 పరుగులు: 2015, 2019 సంవత్సరాల్లో వరల్డ్ కప్ మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ, 978 పరుగులు చేశాడు. వరల్డ్ కప్ మ్యాచుల్లో 1000పరుగుల మార్కును చేరుకోవడానికి ఇంకా 22పరుగులు చేయాల్సి ఉంది. అది పూర్తయితే సచిన్(2,278) విరాట్ కోహ్లీ(1030) సౌరవ్ గంగూలీ(1006) తర్వాత 1000పరుగులు చేసిన నాలుగవ ఆటగాడిగా నిలుస్తాడు.

Details

సిక్సర్లలో రోహిత్ రికార్డు 

అధిక సిక్సర్లు అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 551సిక్సర్లు మారాడు. 553 సిక్సర్లతో అతని కంటే ముందు స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు. మరో 3సిక్సర్లు కొడితే అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలుస్తారు. అత్యధిక సెంచరీలు: వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ మరొక్క సెంచరీ చేస్తే అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ఇప్పుడు రోహిత్ శర్మ సచిన్ కలిసి ఆరు సెంచరీలతో మొదటి స్థానంలో ఉన్నారు.

Details

18వేల పరుగుల జాబితాలోకి రోహిత్ శర్మ 

100అర్థ సెంచరీలు రోహిత్ శర్మ ఇప్పటివరకు 97అర్థ సెంచరీలు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ ఈ ఘనతను అందుకున్నాడు. మరో మూడు అర్దసెంచరీలు చేస్తే 100అర్థసించరీలు చేసిన క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలుస్తాడు. 18000 పరుగులు: అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 17642 పరుగులు చేశాడు. అతని కంటే ముందుగా సచిన్ టెండూల్కర్ 34,357, విరాట్ కోహ్లీ 25767, రాహుల్ ద్రావిడ 24064, పరుగులు సౌరవ్ గంగూలీ 18,433 ఉన్నారు. మరో 358 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో 18వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు.