NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / Rohit Sharma: రోహిత్ శర్మ వీరవిహారం... వన్డేల్లో ద్రవిడ్‌ను దాటేసి, గేల్ రికార్డును బద్దలుకొట్టిన హిట్ మ్యాన్!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Rohit Sharma: రోహిత్ శర్మ వీరవిహారం... వన్డేల్లో ద్రవిడ్‌ను దాటేసి, గేల్ రికార్డును బద్దలుకొట్టిన హిట్ మ్యాన్!
    రోహిత్ శర్మ వీరవిహారం... వన్డేల్లో ద్రవిడ్‌ను దాటేసి, గేల్ రికార్డును బద్దలుకొట్టిన హిట్ మ్యాన్!

    Rohit Sharma: రోహిత్ శర్మ వీరవిహారం... వన్డేల్లో ద్రవిడ్‌ను దాటేసి, గేల్ రికార్డును బద్దలుకొట్టిన హిట్ మ్యాన్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 10, 2025
    09:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. ఆదివారం జరిగిన రెండో వన్డేలో హిట్‌మ్యాన్ 90 బంతుల్లో 119 పరుగులు (12 ఫోర్లు, 7 సిక్స్‌లు) బాది సెంచరీ నమోదు చేశాడు.

    అతను 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించగా, 76 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. రోహిత్ చాలా నెలల తర్వాత వంద రన్స్ పూర్తి చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    ముఖ్యంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సమీపిస్తున్న తరుణంలో రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం భారత జట్టుకు మంచి సంకేతంగా మారింది.

    ఈ శతకంతో వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రోహిత్‌ శర్మ టాప్-10లోకి ప్రవేశించాడు.

    Details

    నాలుగో స్థానంలో హిట్ మ్యాన్

    ఈ క్రమంలో, మాజీ టీమిండియా కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను రోహిత్‌ వెనక్కినెట్టి ముందుకు దూసుకెళ్లాడు.

    ద్రవిడ్‌ 318 ఇన్నింగ్స్‌ల్లో 10,889 పరుగులు సాధించగా, రోహిత్ 259 ఇన్నింగ్స్‌ల్లోనే 10,964 పరుగులు సాధించాడు.

    ప్రస్తుతం వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లలో నాలుగో స్థానంలో ఉన్నాడు.

    ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (18,426), విరాట్ కోహ్లీ (13,906), సౌరవ్ గంగూలీ (11,363) రోహిత్‌ కంటే ముందున్నారు. రెండో వన్డేలో రోహిత్‌ ఏడు సిక్సర్లు బాదాడు.

    Details

    అత్యధిక సిక్సర్ల బాదిన రెండో ప్లేయర్ గా రికార్డు

    దీనితో వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు (338) బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.

    మ్యాచ్‌కు ముందు వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ (331)తో రోహిత్‌ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు.

    అయితే ఈ మ్యాచ్‌లో ఏడు సిక్సర్లు బాది గేల్ రికార్డును అధిగమించాడు. ఇక, ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (351) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

    ఈనెల 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీలో అఫ్రిది రికార్డును రోహిత్ బ్రేక్ చేసే అవకాశముంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రోహిత్ శర్మ
    రాహుల్ ద్రావిడ్
    టీమిండియా

    తాజా

    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం
    Fat burning: వేగంగా బరువు తగ్గాలంటే.. ఉదయం ఈ 5 అలవాట్లు పాటించండి జీవనశైలి
    Gujarat Titans: గుజరాత్ జట్టులో మిడిలార్డర్ సమస్య ఉంది : టూమ్ మూడీ  గుజరాత్ టైటాన్స్

    రోహిత్ శర్మ

    IND vs NZ: దురదృష్టకరరీతిలో ఔట్..  కన్నీటితో మైదానాన్ని వీడిన రోహిత్ శర్మ! క్రీడలు
    Rohit Sharma: RCBలో చేరాలని రోహిత్ శర్మకు అభ్యర్ధన.. భారత కెప్టెన్‌ రియాక్షన్ వైరల్! రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
    Rohit-Virat: సచిన్ లాగే కోహ్లీ, రోహిత్ ఎందుకు రంజీలలో ఆడకూడదు.. ప్రశ్నించిన మాజీ సెలెక్టర్! సచిన్ టెండూల్కర్
    Virat Kohli: భావోద్వేగాలను నియంత్రించుకోవాలి.. విరాట్ కోహ్లీకి బ్రాడ్ హాగ్ కీలక సూచన  విరాట్ కోహ్లీ

    రాహుల్ ద్రావిడ్

    ది వాల్ బ్యాటింగ్ సీక్రెట్ ఇదే.. మాజీ ప్లేయర్ వెల్లడి క్రికెట్
    రాహుల్ ద్రవిడ్‌కు అనారోగ్యం, చికత్స కోసం బెంగళూరు క్రికెట్
    విరాట్ స్థానంపై ద్రవిడ్ సూటిగా సమాధానాలు క్రికెట్
    జహీర్‌ఖాన్ లాంటి లెఫ్ట్ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ టీమిండియాకు అవసరం క్రికెట్

    టీమిండియా

    Sitanshu Kotak: టీమిండియా కొత్త బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కోటక్  క్రీడలు
    Team India : ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా గిల్ ఛాంపియన్స్ ట్రోఫీ
    BCCI: బీసీసీఐ నూతన నిబంధనలు.. ఆటగాళ్ల కోసం ఒకే బస్సు! బీసీసీఐ
    Chris Martin: కోల్డ్‌ప్లే కాన్సర్ట్‌లో బుమ్రా క్లిప్‌.. క్షమాపణ కోరిన క్రిస్ మార్టిన్‌  జస్పిత్ బుమ్రా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025