శ్రీలంకతో సిరీస్‌లు.. రోహిత్, రాహుల్ దూరం
బంగ్లాదేశ్ పర్యటనను విజయవంతంగా ముగించిన టీమిండియా మరో అసక్తికర సమరానికి సిద్ధమవుతోంది. సొంతగడ్డపై శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. జనవరి 3 నుంచి టీ20 సిరీస్, 10 నుంచి వన్డే సిరీస్ ప్రారంభకానున్నాయి. భారత్ కెప్టెన్ రోహిత్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగనున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. జనవరి మూడో తేదీ నుంచి శ్రీలంకతో స్వదేశంలో భారత్ మూడు టీ20ల సిరీస్‌ను ఆడనుంది. బంగ్లాతో సిరీస్ సందర్భంగా గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా కోలుకోకపోవడంతో లంకతో సిరీస్ ఆడేది కష్టమేనని తెలుస్తోంది. కేఎల్ రాహుల్ కూడా వివాహం చేసుకోబుతున్నట్లు సమాచారం. దీంతో లంక సిరీస్ కు రాహుల్ దూరం కానున్నాడు.
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మపై వేటు..!
రోహిత్, రాహుల్ గైర్హాజరీలో భారత టీ20 జట్టుకు హార్దిక్ పాండ్య నాయకత్వం వహించే అవకాశం ఉంది. వన్డేలో ఎలాగో శిఖర్ ధావన్ కెప్టెన్సీ చేపట్టే ఛాన్స్ ఉందని క్రీడా వర్గాలు వెల్లడించాయి. రోహిత్ శర్మ ఈ ఏడాది రెండు టెస్టులో 30 సగటుతో 90 పరుగులు చేశాడు, ఎనిమిది ODIల్లో కేవలం 249 పరుగులు చేశాడు. మూడు అర్ధ సెంచరీలు చేశారు. 29 టీ-20లో 656 పరుగులు చేశాడు. 2012 తర్వాత ఏడాది పాటు అంతర్జాతీయ సెంచరీ నమోదు చేయలేదు. రాహుల్ 2022లో 10 వన్డేలు ఆడి, 251 పరుగులు చేశాడు. ముఖ్యంగా రాహుల్ ఈ తొమ్మిది వన్డేలను విదేశాల్లో ఆడాడు. వన్డేల్లో కూడా అశించిన స్థాయిలో రాణించలేదు.