Page Loader
Rohit Sharma: MI డ్రెస్సింగ్ రూమ్ బ్యాటింగ్ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ
MI డ్రెస్సింగ్ రూమ్ బ్యాటింగ్ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ

Rohit Sharma: MI డ్రెస్సింగ్ రూమ్ బ్యాటింగ్ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 24, 2025
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ముంబయి ఇండియన్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేయడం,రోహిత్ శర్మ రెండోసారి హాఫ్ సెంచరీ సాధించడం చూసినవారికి, జట్టు ప్రదర్శన ఎంత ఉత్సాహంగా ఉందో చెప్పడానికి ఇదే చాలు. ఉప్పల్‌లోని స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి 70 పరుగులతో మెరిశాడు. 'హిట్‌మ్యాన్' ఔటైనప్పటికీ, సూర్యకుమార్ యాదవ్ 40 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

వివరాలు 

రోహిత్ శర్మకు 'బ్యాటింగ్ అవార్డు' 

ఈ పోరులో విజయం సాధించిన అనంతరం, ముంబయి ఇండియన్స్ మేనేజ్‌మెంట్ డ్రెస్సింగ్ రూమ్‌లో 'బ్యాటింగ్ అవార్డు' ప్రకటించింది. ఈ గౌరవాన్ని రోహిత్ శర్మ దక్కించుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ తన చేతులమీదుగా ఈ అవార్డును రోహిత్‌కు అందించాడు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ''ఇలాగే మేము క్రమశిక్షణతో ఆడుతూ ఉంటే, మరిన్ని విజయాలు మన దిశగా వస్తాయి. కష్టకాలాల్లోనూ మౌనంగా ఉంటూ, మన ఆట శైలిని కొనసాగిస్తే సానుకూల ఫలితాలు తప్పవు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌కి మన ప్రదర్శనే బలమైన ఉదాహరణ. మిగతా మ్యాచుల్లో కూడా ఇలాగే ఆడాల్సిన అవసరం ఉంది'' అని చెప్పాడు.

వివరాలు 

పాయింట్ల పట్టికలో మూడో స్థానం 

ఈ గెలుపుతో ముంబయి ఇండియన్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఇప్పటివరకు 9 మ్యాచుల్లో 5 విజయాలను, 4 ఓటములను మూటగట్టుకుంది. మిగిలిన ఐదు మ్యాచ్‌లలో కనీసం మూడు విజయాలు సాధిస్తే ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు బలంగా ఉన్నాయని నిపుణుల అంచనా. ప్రస్తుతం జట్టు ప్రదర్శనను చూస్తే, ఈ లక్ష్యం సాధించడం ముంబయి ఇండియన్స్‌కు పెద్ద కష్టంగా కనిపించడం లేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

MI డ్రెస్సింగ్ రూమ్ బ్యాటింగ్ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ