Rohit Sharma Retirement: రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఎదురైన పరాజయం తర్వాత తాను రిటైర్మెంట్ గురించి కూడా ఆలోచించినట్లు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించారు. స్వదేశంలో జరిగిన ప్రపంచకప్‌లో రోహిత్ నాయకత్వంలోని భారత జట్టు దూకుడుగా ముందుకెళ్లింది. లీగ్ దశలో వరుసగా 9 విజయాలు సాధించి అజేయంగా ఫైనల్‌కు చేరిన భారత్, అత్యంత కీలక మ్యాచ్‌లో మాత్రం తడబడింది. 241 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి ఛేదించి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. డిసెంబర్ 21న జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రోహిత్, ప్రపంచకప్ గెలవడమే తన ఏకైక లక్ష్యమని, ఆ కల నెరవేరకపోవడంతో పూర్తిగా మానసికంగా కుంగిపోయానని చెప్పుకొచ్చారు.
Details
రెండు నెలల సమయం పట్టింది
ఆ ఓటమి నుంచి బయటపడేందుకు తనకు రెండు నెలల సమయం పట్టిందని, ఆ కాలంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యానని వెల్లడించారు. ఇప్పుడు ఈ మాటలు చెప్పడం ఈజీగా అనిపించొచ్చు కానీ, ఆ సమయంలో మాత్రం చాలా కష్టంగా అనిపించింది. ఒక దశలో ఈ ఆటనే వదిలేయాలనే ఆలోచన కూడా వచ్చింది. క్రికెట్ నా నుంచి అన్నింటినీ తీసుకెళ్లినట్లుగా అనిపించిందని రోహిత్ భావోద్వేగంగా తెలిపారు. అయితే అదే సమయంలో తన ముందున్న 2024టీ20 ప్రపంచకప్‌ను గుర్తించి,దానిపై దృష్టి పెట్టినట్లు రోహిత్ వెల్లడించారు. ఆ నిర్ణయమే తన జీవితాన్ని మళ్లీ మలుపు తిప్పిందని పేర్కొన్నారు. ఏడాది లోపే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. 2024టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలిపి తన కలను నెరవేర్చుకున్నానని చెప్పారు.
Details
2027 వన్డే ప్రపంచకప్ తర్వాత వీడ్కోలు పలికే అవకాశం
అంతేకాదు, టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత కేవలం ఎనిమిది నెలల్లోనే భారత్ మరో ఐసీసీ ట్రోఫీని కూడా గెలుచుకుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. ఇదిలా ఉండగా వన్డే జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతారని భావించిన రోహిత్‌కు సెలెక్టర్లు ఊహించని షాక్ ఇచ్చారు. అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించి శుభ్‌మన్ గిల్‌కు బాధ్యతలు అప్పగించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో గిల్, రోహిత్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి.