Page Loader
RR vs CSK: 32పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం 
చెన్నైని చిత్తు చేసిన రాజస్థాన్ రాయల్స్

RR vs CSK: 32పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం 

వ్రాసిన వారు Sriram Pranateja
Apr 27, 2023
11:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ లో భాగంగా జైపూర్ లో సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు, ఆరంభం నుండి దూకుడును చూపించింది. కానీ 20ఓవర్లు ముగిసే సరికి 6వికెట్ల నష్టానికి 170పరుగులు మాత్రమే చేసి రాజస్థాన్ రాయల్స్ కు విజయాన్ని అందించింది. చెన్నై బ్యాటర్లలో శివమ్ దూబే 52, రుతురాజ్ గైక్వాడ్ 47, మొయిన్ అలీ 23, రవీంద్ర జడేజా 23, అజింక్యా రహానే 15పరుగులు చేసారు. రాజస్థాన్ బౌలర్లలో అడం జంపా 3, అశ్విన్ 2 వికెట్లు తీసుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

32పరుగుల తేడాతో చెన్నైని చిత్తు చేసిన రాజస్థాన్ రాయల్స్