Page Loader
RR vs KKR : నేడు ఐపీఎల్ లో మ‌రో స‌మ‌రానికి రంగం సిద్ధం.. కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో తలపడనున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 
కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో తలపడనున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్

RR vs KKR : నేడు ఐపీఎల్ లో మ‌రో స‌మ‌రానికి రంగం సిద్ధం.. కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో తలపడనున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2025
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో రసవత్తర సమరానికి ముహూర్తం ఫిక్స్ అయింది. నేడు (బుధవారం, మార్చి 26) గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌లో ఓటమి పాలవడంతో, ఈసారి విజయం సాధించి లీగ్‌లో తొలి గెలుపు అందుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. గత మ్యాచ్‌ల్లో ఫలితాలు కేకేఆర్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన పోరులో ఓటమి పాలవగా, రాజస్థాన్ రాయల్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. అయితే, ఈ రెండు జట్లు గత మ్యాచుల్లో బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. కానీ, బౌలింగ్‌లో అంత బలంగా లేకపోవడంతో మ్యాచ్‌ను కోల్పోయాయి.

వివరాలు 

హెడ్ టు హెడ్ రికార్డులు 

ఇప్పటి వరకు కేకేఆర్, రాజస్థాన్ జట్లు మొత్తం 30 సార్లు పరస్పరంగా తలపడగా, 14 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ విజయం సాధించగా, మరో 14 మ్యాచ్‌ల్లో కేకేఆర్ గెలిచింది. ఇంకా, రెండు మ్యాచ్‌లు ఫలితం తేలకుండానే ముగిశాయి. గౌహతి పిచ్ నివేదిక గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది.ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. గత టి20 మ్యాచ్‌లను పరిశీలిస్తే, మొదటి ఇన్నింగ్స్‌లో సాధారణంగా 200కి పైగా స్కోరు నమోదవుతోంది. కానీ,ఆరంభంలో పేస్ బౌలర్లకు కొంత మద్దతు దక్కే అవకాశముంది. గతంలో ఇదే స్టేడియంలో కేకేఆర్, రాజస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.

వివరాలు 

కేకేఆర్ జట్టు తీరును అంచనా వేస్తే... 

ఇప్పటి వరకు ఈ స్టేడియం నాలుగు ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. వాటిలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు రెండు సార్లు విజయం సాధించగా, లక్ష్యాన్ని చేధించిన జట్టు ఒక్కసారి మాత్రమే గెలిచింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. కేకేఆర్ జట్టులో కెప్టెన్ అజింక్యా రహానే తొలి మ్యాచ్‌లో అర్థశతకం సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఓపెనర్ సునీల్ నరైన్ కూడా బాగా ఆడాడు.కానీ,కీలక ఆటగాళ్లు క్వింటన్ డికాక్,వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్,ఆండ్రీ రసెల్‌లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో వీరు రాణిస్తే,కోల్‌కతాకు తిరుగుండదు. బౌలింగ్‌లో వ‌రుణ్ చక్రవర్తి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయాడు. హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ ఆరోరాలు తమ స్థాయిని నిరూపించుకోవాలి.

వివరాలు 

రాజస్థాన్ జట్టు - విజయం కోసం కీలక ఆటగాళ్లు 

సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, హెట్‌మైర్, శుభమ్ దూబే లాంటి బ్యాటర్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరితో పాటు యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, నితీశ్ రాణా మంచి స్కోర్లు చేయగలిగితే రాజస్థాన్ భారీ టోటల్ సాధించవచ్చు. బౌలింగ్ విభాగంలో ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గత మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. అతను 4 ఓవర్లలో 76 పరుగులిచ్చి భారీ దెబ్బతిన్నాడు. అతనితో పాటు ఫజల్ హక్ ఫరూకీ, తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే లు మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. వీరు ఫామ్‌లోకి వస్తే, కోల్‌కతాకు కష్టాలు తప్పవు.

వివరాలు 

రెండు జ‌ట్ల ప్లేయింగ్ ఎలెవ‌న్ అంచ‌నా.. 

ఈ మ్యాచ్‌లో రెండు జట్లూ తమ తొలి విజయం కోసం పోరాడుతాయి. బ్యాటింగ్ విభాగంలో రెండు జట్లూ బలంగా ఉన్నప్పటికీ, బౌలింగ్ లో తేలిపోతున్నాయి. చివరకు, ఏ జట్టు బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన ఇస్తుందో, అదే విజయం సాధించే అవకాశం ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్.. అజింక్య రహానే(కెప్టెన్‌),క్వింటన్ డికాక్(వికెట్ కీప‌ర్‌), సునీల్ నరైన్,వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా,వరుణ్ చక్రవర్తి, స్పెన్సర్ జాన్సన్/అన్రిచ్ నార్ట్జే. రాజస్థాన్ రాయల్స్.. సంజూ శాంస‌న్, యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా,రియాన్ పరాగ్, ధ్రువ్‌ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే,సందీప్ శర్మ, ఫజల్‌హాక్ ఫరూఖీ.