Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్‌కు వన్డేల్లో ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలి : మాజీ క్రికెటర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు వన్డేల్లో ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. రాంచి వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్ నిరాశపర్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడిని నాలుగోస్థానంలో ఆడించే నిర్ణయాన్ని ఆకాశ్ చోప్రా తీవ్రంగా విమర్శించాడు. 'రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటివరకు వన్డేల్లో నాలుగో స్థానంలో ఎప్పుడూ బ్యాటింగ్ చేయలేదు. డెవాల్డ్ బ్రెవిస్ అద్భుత క్యాచ్ కారణంగా అతడు దురదృష్టవశాత్తూ అవుట్ అయ్యాడు. ఒక్క మ్యాచ్‌ను చూసి అతడి సామర్థ్యంపై నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనా మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. వెంటనే జట్టు నుంచి తప్పించేయడం సరికాదు.
Details
మిడిలార్డర్ లో పంత్ ను ఆడించాలి
రుతురాజ్ ఓ సహజ ఓపెనర్. ఆ స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చేంతవరకూ అతడి కెరీర్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని చోప్రా తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. అలాగే రిషబ్ పంత్‌ను బెంచ్‌లో ఉంచి వాషింగ్టన్ సుందర్‌కు తుది జట్టులో చోటు కల్పించడంపై కూడా ఆకాశ్ చోప్రా అభ్యంతరం వ్యక్తం చేశాడు. ''పంత్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. నాలుగు, ఐదు స్థానాల్లో బ్యాటింగ్ చేయగలడు. మిడిల్ ఆర్డర్‌లో అవకాశం ఉన్నా పంత్‌ను ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో ఆ పొజిషన్‌లో ఎప్పుడూ ఆడని ఇద్దరిని పంపించారని విమర్శించాడు. రుతురాజ్ నాలుగోస్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. 14 బంతుల్లో కేవలం 8 పరుగులే చేసిన అతడిని డెవాల్డ్ బ్రెవిస్ పర్ఫెక్ట్ క్యాచ్ పట్టి పెవిలియన్‌కు పంపించాడు.