క్లీన్ స్వీప్ కోసం సౌతాఫ్రికా, పరువు కోసం ఇంగ్లండ్
సౌతాఫ్రికాతో జరిగిన తొలి రెండు వన్డేలు ఇంగ్లండ్‌కు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. రేపు ఇంగ్లండ్ తో మూడో వన్డేకి న్యూజిలాండ్ సిద్ధమైంది. ఆఖరి వన్డేలోనూ విజయం సాధించి.. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని ఆత్మవిశ్వాసంతో న్యూజిలాండ్ బరిలోకి దిగుతోంది. ఎలాగైనా ఓ మ్యాచ్ నెగ్గి పరువు నిలుపుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది. కింబర్లీలోని డైమండ్ ఓవల్ మైదానంలో మూడో వన్డే జరగనుంది. ఇక్కడ మొత్తం 18 వన్డే మ్యాచ్ లు జరిగాయి. తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 12సార్లు గెలిచాయి. ఈ వేదికపై సౌతాఫ్రికా చివరిగా రెండు మ్యాచ్ లు ఆడగా.. ఒక మ్యాచ్ లో విజయం సాధించింది. మ్యాచ్ ఫ్యాన్‌కోడ్ యాప్‌లో సాయంత్రం 4:30గంటలకు ప్రసారం కానుంది.
ఇరు జట్లలోని సభ్యులు
సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ టెంబా బావుమా, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, డేవిడ్ మిల్లర్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇంగ్లండ్ తరుపున జాసన్ రాయ్ స్థానంలో ఓపెనర్ గా ఫిల్ సాల్ట్ రావచ్చు. జోస్ బట్లర్ మిడిల్ ఆర్డర్‌లో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (WK), టెంబా బావుమా (సి), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, మార్క్రామ్, హెన్రిచ్‌క్లాసెన్, మిల్లర్, జాన్సెన్, వేన్‌పార్నెల్, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్ట్జే, లుంగిస్ ఎన్గిడి/కాగిస్ రబడ ఇంగ్లండ్ : జాసన్ రాయ్/ఫిల్ సాల్ట్, డేవిడ్ మలన్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (c & wk), మోయిన్అలీ, క్రిస్‌వోక్స్, సామ్‌కుర్రాన్, రషీద్, ఆలీ స్టోన్, రీస్ టోప్లీ/జోఫ్రా ఆర్చర్.