వరుస ఓటములతో ఇంగ్లండ్ చెత్త రికార్డు
వరుస ఓటములతో ఇంగ్లండ్ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ పరాజయం పాలైంది. ఇంగ్లండ్ 50 ఓవర్లలో 342/7 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 49.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-0 తో కైవసం చేసుకుంది. రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ కు దిగన ఇంగ్లండ్, ఏడు ఓవర్లకే జోసన్ రాయ్, మలాన్ వికెట్లను కోల్పోయింది. హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, మొయిన్ అలీ అర్ధసెంచరీలతో రాణించడంతో ఇంగ్లండ్ 342 పరుగులకు చేసింది. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ లో టెంబా బావుమా సెంచరీ, మిల్లర్ అర్ధ సెంచరీతో రాణించడంతో సౌతాఫ్రికా విజయం సాధించింది.
వరుసగా ఐదు వన్డేల్లో ఓడిన ఇంగ్లండ్
నవంబర్ 2022లో వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో 3-0తో ఇంగ్లండ్ ఓడిపోయింది. మొదటి వన్డేలో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో వన్డేలో 72 పరుగులు, మూడో వన్డేలో 221 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది. వరుసగా ఐదు వన్డేలు ఓడిపోయిన దేశంగా ఇంగ్లండ్ చెత్త రికార్డును నమోదు చేసింది. బ్రూక్ 75 బంతుల్లో 80 పరుగులు చేసి వన్డేలో తొలి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. బట్లర్ 82 బంతుల్లో 94 పరుగులు చేసి, వన్డేలో 23 అర్ధసెంచరీలు, 10 సెంచరీలు చేశాడు. బట్లర్ 161 గేమ్‌ల్లో 40.79 సగటుతో 4,405 పరుగులు చేశాడు.