హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన డేవిడ్ మిల్లర్
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ అద్భుతంగా రాణించారు. కేవలం 37 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ నిర్ధేశించిన 343 పరుగల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 49.1 ఓవర్లకు 237 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను సౌతాఫ్రికా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 233 పరుగులకు 4 వికెట్లను సౌతాఫ్రికా కోల్పోవడంతో ఐదో స్థానంలో వచ్చిన డేవిడ్ మిల్లర్ జట్టును అదుకున్నాడు. మార్క్ రాయ్ కలిసి 49 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఇంగ్లండ్‌పై డేవిడ్ మిల్లర్‌కు మంచి రికార్డు ఉంది
2010లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మిల్లర్ అరంగేట్రం చేశాడు. ఈ స్టార్ బ్యాటర్ 151 మ్యాచ్‌ల్లో 3,767 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 20 అర్ధ సెంచరీలను కలిగి ఉన్నాడు. స్వదేశంలో మిల్లర్ 52.67 సగటుతో 1,791 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ టీంపై డేవిడ్ మిల్లర్‌కు మంచి రికార్డు ఉంది. 12 మ్యాచ్‌ల్లో 118.00 సగటుతో 354 పరుగులు చేశాడు. ఇందులో ఐదు అర్ధ సెంచరీలున్నాయి. ఇంగ్లండ్ టీంపై డేవిడ్ మిల్లర్‌కు మంచి రికార్డు ఉంది. 12 మ్యాచ్‌ల్లో 118.00 సగటుతో 354 పరుగులు చేశాడు. ఇందులో ఐదు అర్ధ సెంచరీలున్నాయి. తొలి వన్డేలో మిల్లర్ 53 పరుగులు చేసిన విషయం తెలిసిందే.