Page Loader
SA vs IND: నేడే దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియాలో రెండు మార్పులు
నేడే దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియాలో రెండు మార్పులు

SA vs IND: నేడే దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియాలో రెండు మార్పులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2024
08:29 am

ఈ వార్తాకథనం ఏంటి

సెంచూరియన్ వేదికగా ఇవాళ రాత్రి 8:30 గంటలకు భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌లలో చెరో విజయం సాధించిన ఈ జట్లు సిరీస్‌లో సమంగా నిలిచాయి. సిరీస్‌ను కోల్పోకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ పోరులో ఎవరు గెలిచినా, ఆ జట్టుకు చివరి మ్యాచ్‌లో ఒత్తిడి తక్కువగా ఉంటుంది. బ్యాటింగ్, పేస్‌కు అనుకూలంగా ఉండే సెంచూరియన్ పిచ్‌లో భారత్, దక్షిణాఫ్రికా తమ వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. భారత జట్టు ఎంపికలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు ముఖ్యస్థానం ఉంది. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్ బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ, రెండో టీ20లో కేవలం ఒకే ఓవర్ వేయించారు.

వివరాలు 

పేసర్ గెరాల్డ్ కోయిట్జీ, యాన్‌సెన్ తొలి స్పెల్‌లో చక్కటి ప్రదర్శన

దానిని విశ్లేషకులు టీమిండియా ఓటమికి కారణంగా పేర్కొన్నారు. సెంచూరియన్ పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని, రమణ్‌దీప్ సింగ్ లాంటి పేసర్-బ్యాట్స్‌మన్‌ను తీసుకుంటే, జట్టు సమతుల్యంగా ఉంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ స్థానం పదిలంగా ఉండొచ్చు. దక్షిణాఫ్రికా జట్టు కూడా సిరీస్ విజయానికి పట్టుదలగా ఉంది. తొలి మ్యాచ్ ఓటమి అనంతరం, రెండో మ్యాచ్‌లో సమష్టి కృషితో విజయాన్ని సాధించింది. పేసర్ గెరాల్డ్ కోయిట్జీ, యాన్‌సెన్ తొలి స్పెల్‌లో చక్కటి ప్రదర్శనతో భారత బ్యాటింగ్‌ను దెబ్బకొట్టారు. యువ బౌలర్లు సిమోలేన్, పీటర్ సైతం కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. కేశవ్ మహరాజ్ స్పిన్ విభాగంలో తన నైపుణ్యాన్ని చూపుతున్నాడు.

వివరాలు 

తుది జట్లు (అంచనా)

భారత్: సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, సూర్య కుమార్‌ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, రింకు సింగ్, అక్షర్ పటేల్, రమణ్‌దీప్‌ సింగ్/రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ సింగ్, అవేశ్‌ ఖాన్, వరుణ్ చక్రవర్తి దక్షిణాఫ్రికా: రియాన్ రికిల్‌టన్, రీజా హెండ్రిక్స్, ఐదెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్‌), డేవిడ్ మిల్లర్, మార్కో యాన్‌సెన్, సిమోలేన్, గెరాల్డ్ కోయిట్జీ, కేశవ్ మహరాజ్‌, పీటర్