Page Loader
SA vs WI: రసవత్తరంగా సౌతాఫ్రికా, వెస్టిండీస్ టెస్టు మ్యాచ్
16 ఓవర్లలో 5 వికెట్లు తీసిన నోర్జే

SA vs WI: రసవత్తరంగా సౌతాఫ్రికా, వెస్టిండీస్ టెస్టు మ్యాచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 02, 2023
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికా- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు హోరాహోరీగా సాగుతోంది. 314/8 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆతిధ్య సౌతాఫ్రికా మరో 28 పరుగులు జోడించి తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌటైంది. అల్జారీ జోసెఫ్ ఐదు వికెట్ల తో సత్తా చాటాడు. వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ లో 212 పరుగులకే అలౌటైంది. నోర్జే (5/36), రబాడ (2/44), కోయెట్జీ (2/45), జన్సెన్‌ (1/64) దెబ్బకు వెస్టిండీస్ కుప్పకూలింది రెండు రోజు ఏకంగా 16 వికెట్లు పడ్డాయి. ఈ వికెట్లలన్నీ ఇరు జట్ల పేసర్ల ఖాతాలోకి వెళ్లడంతో ఆట మరింత రసవత్తరంగా మారింది.

మార్ర్కమ్

సెంచరీతో రాణించిన మార్ర్కమ్

సౌతాఫ్రికా పేసర్ నార్ట్జే ఐదు మెయిడిన్‌లతో సహా 16 ఓవర్లలో 5 వికెట్లు తీసి 36 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం 19 టెస్టు మ్యాచ్‌లో 26.41 సగటుతో 69 వికెట్లను పడగొట్టాడు. సఫారీల ఇన్నింగ్స్‌లో మార్క్రమ్‌ (115) సెంచరీతో కదం తొక్కగా.. డీన్‌ ఎల్గర్‌ (71) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. విండీస్‌ బౌలర్లలో అల్జరీ జోసఫ్‌ 5 వికెట్లు తీశాడు సఫారీ టీమ్‌.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 49 పరుగులు సాధించింది. విండిస్ బౌలర్లలో అర్జరీ జోసఫ్ 2, రోచ్, హోల్డర్ తలో ఒక వికెట్ పడగొట్టారు.