Page Loader
SA vs WI: ఐడెన్ మార్ర్కమ్ సూపర్ సెంచరీ.. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
టెస్టులో 6 సెంచరీలు పూర్తి చేసిన మార్ర్కమ్

SA vs WI: ఐడెన్ మార్ర్కమ్ సూపర్ సెంచరీ.. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 01, 2023
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అదరగొట్టిన ఐడెన్ మార్ర్కమ్ టెస్టులోనూ తన జోరును కొనసాగుతున్నాడు. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు. 174 బంతుల్లో 18 ఫోర్ల సాయంతో 115 పరుగులు చేశాడు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 82 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. మార్క్రమ్ తోడుగా డీన్ ఎల్గర్ అర్ధ సెంచరీతో రాణించాడు. తొలి వికెట్‌కు మార్క్రమ్, ఎల్గర్ కలిసి 141 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం టోనీ డీ జోర్జితో కలిసి మార్ర్కమ్ రెండో వికెట్‌కు 80 పరుగులను జోడించారు.

మార్ర్కమ్

మార్క్రమ్ సెంచరీ చేయడంపై సన్‌రైజర్స్ ఫ్యాన్ హర్షం

ఓపెనర్లు ఎల్గర్, మార్క్రమ్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి, సులభంగా పరుగులు రాబట్టారు. ఉదయం సెషన్‌లో 90 పరుగులు జోడించారు. అల్జారీ జోసెఫ్ బౌలింగ్ మార్క్రమ్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. అనంతరం కెప్టెన్ టెంబా బవుమా(0) సిల్వర్ డక్‌గా వెనుదిరగ్గా.. కీగన్ పీటర్సన్(14), హెన్రీచ్ క్లాసెన్(20) దారుణంగా విఫలమయ్యారు ప్రస్తుతం టెస్టులో మార్ర్కమ్ 35 కంటే ఎక్కువ సగటుతో 2110 పరుగులు చేశాడు. ఇందులో అరు సెంచరీలు, తొమ్మిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. మార్ర్కమ్ సెంచరీ చేయడంపై సన్ రైజర్స్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జోరును ఐపీఎల్ కొనసాగించి టైటిల్ అందిచాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.