Page Loader
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
ఫిబ్రవరి 28న టెస్ట్ సిరీస్‌ ప్రారంభం కానుంది

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 15, 2023
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాఫ్రికా‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు వెస్టిండీస్ సిద్ధమైంది. ఫిబ్రవరి 28న దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్ తలపడనుంది. ఈ సిరీస్‌కు వెస్టిండీస్ టెస్టు సిరీస్ కోసం 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఇందులో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జోమెల్ వారికన్, బ్యాటర్ న్క్రుమా బోన్నర్‌లకు చోటు దక్కలేదు. మోకాలి గాయం కారణంగా జేడెన్ సీల్స్ దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా ఆరో స్థానంలో ఉంది. వెస్టిండీస్ ఆల్ రౌండర్ అలిక్ అథానాజ్, పేసర్ అకీమ్ జోర్డాన్‌ మొదటిసారిగా టెస్టులో అరంగేట్రం చేయనున్నారు. ఇంతకుముందు వెస్టిండీస్, జింబాబ్వేపై 1-0తో సిరీస్ విజయం సాధించింది.

వెస్టిండీస్

టెస్టు సిరీస్‌కు ఎంపికైన వెస్టిండీస్ జట్టు ఇదే

వెస్టిండీస్ ఆల్ రౌండర్ అలిక్ అథానాజ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 1,154 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ ఆల్ రౌండర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. 22 మ్యాచ్‌ల్లో ఏడు వికెట్లను కూడా పడగొట్టాడు. పేసర్ జోర్డాన్ ఈ ఏడాది బాగా బౌలింగ్ చేస్తున్నాడని, ఐదు మ్యాచ్‌ల్లో రెండుసార్లు నాలుగు వికెట్లు తీసి రాణిస్తున్నాడని వెస్టిండీస్ లీడ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ పేర్కొన్నాడు. వెస్టిండీస్ జట్టు: క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, టాగెనరైన్ చందర్‌పాల్, రోస్టన్ చేజ్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, జాసన్ హోల్డర్, అకీమ్ జోర్డాన్, గుడ్ మేయర్స్, గుడ్ మేయర్స్ మోటీ, రేమాన్ రీఫర్, కెమర్ రోచ్, డెవాన్ థామస్