Page Loader
జింబాబ్వే నడ్డి విరిచిన విండీస్ బౌలర్, సిరీస్ కైవసం
సిరీస్‌ను సొంతం చేసుకున్న వెస్టిండీస్

జింబాబ్వే నడ్డి విరిచిన విండీస్ బౌలర్, సిరీస్ కైవసం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 15, 2023
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్ 1-0తో సొంతం చేసుకుంది. బులవాయో వేదికగా జరిగిన రెండో టెస్టులో విండీస్ కేవలం 4 పరుగులు తేడాతో గెలిచి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. జింబాబ్వే పతనాన్ని విండీస్ బౌలర్ గుడాకేష్ మోటీ శాసించాడు. ఆరు వికెట్లు పడగొట్టి విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 177 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన జింబాబ్వే 173 పరుగులకే కుప్పకూలింది. క్రెయిగ్ ఇర్విన్ 72 పరుగులతో ఒంటరి పోరాటం చేసినా ఓటమి తప్పలేదు. జింబాబ్వే మొదటి ఇన్నింగ్స్ లో మోటీ (7/37), రెండో ఇన్నింగ్స్‌లో 70/5 సత్తా చాటాడు.

వెస్టిండీస్

వెస్టిండీస్‌పై జింబాబ్వే ఒక టెస్టు కూడా గెలవలేదు

రీఫర్ 86 బంతుల్లో 53 పరుగులు చేశాడు. మొత్తం ఐదు మ్యాచ్‌ల్లో 200 పరుగులను సాధించాడు. దీంతో రెండో టెస్టు అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆల్ రౌండర్ చేజ్ 132 బంతుల్లో 70 పరుగులు చేశాడు. దీంతో టెస్టులో 111వ అర్ధశతకాన్ని సాధించాడు. 47 మ్యాచ్‌ల్లో 27.01 సగటుతో 2,215 పరుగులు చేశాడు. చేజ్ ఆరో వికెట్‌కు డసిల్వాతో కలిసి 85 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఎర్విన్ తన టెస్టు క్రికెట్లో వెస్టిండీస్‌పై ఐదు అర్ధశతకాలు చేశాడు. 20 మ్యాచ్‌లలో 35.05 సగటుతో 1,332 పరుగులు చేశాడు. జింబాబ్వే ఇప్పటి వరకు వెస్టిండీస్‌పై ఒక్క టెస్టు మ్యాచ్‌ కూడా గెలవకపోవడం గమనార్హం.