వెస్టిండీస్‌కి ధీటుగా బదులిచ్చిన జింబాబ్వే, డ్రాగా ముగిసిన మొదటి టెస్టు
జింబాబ్వే-వెస్టిండీస్ మధ్య బులవాయో వేదికగా మధ్య జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ డ్రా గా ముగిసింది. మ్యాచ్ చివరి రోజు వెస్టిండీస్ నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్ లో 54 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 134 పరుగులను చేసింది. వెస్టిండీస్ జట్టులో టాగెనరైన్ చంద్రపాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. క్రైగ్ బ్రాత్ వైట్ కూడా సెంచరీతో మెరిశాడు. జింబాబ్వే తరుపున గ్యారీ బ్యాలెన్స్ సెంచరీతో కదం తొక్కడంతో మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. మొదటి తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ వర్షం కారణంగా 447/6 స్కోరు చేసి, డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ ఓపెనర్లు 336 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డును సాధించాడు.
టాగెనరైన్ చంద్రపాల్ డబుల్ సెంచరీ
జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ లో 379/9 స్కోరు చేసింది. దీంతో వెస్టిండీస్ 68 పరుగుల అధిక్యంలో నిలిచింది. వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో 203/5 స్కోరు చేసింది. దీంతో జింబాబ్వే 272 పరుగులు చేయాల్సి వచ్చింది. కెప్టెన్ బ్రాత్‌వైట్ తొలి ఇన్నింగ్స్‌లో 182 పరుగుల భారీ స్కోర్ చేశాడు. 312 బంతుల్లో 18 ఫోర్లతో చెలరేగిపోయాడు. బ్రాత్‌వైట్ ప్రస్తుతం 35.78 సగటుతో 5,296 పరుగులు చేశాడు. వెస్టిండీస్ తరఫున 12వ సెంచరీని నమోదు చేశాడు. చందర్‌పాల్ తొలి ఇన్నింగ్స్‌లో 467 బంతుల్లో 207 పరుగులతో సత్తా చాటాడు.విండీస్ దిగ్గజ క్రికెటర్ శివనారాయణ్ చందర్‌పాల్ తనయుడైన టాగెనరైన్ చంద్రపాల్ తన తండ్రితో కలిసి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాడు.