Page Loader
సెంచరీతో కదం తొక్కిన చందర్ పాల్
క్రైగ్ బ్రాత్‌వైట్‌తో కలిసి చందర్‌పాల్ 300కు పైగా పరుగులు జోడించాడు

సెంచరీతో కదం తొక్కిన చందర్ పాల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 06, 2023
06:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

వెస్టిండీస్‌ బ్యాటర్‌ టాగెనరైన్‌ చందర్‌పాల్‌ సెంచరీతో కదం తొక్కాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండు మ్యాచ్ ల సిరిస్ లో భాగంగా వెస్టిండీస్ యువ ఆటగాడు చందర్‌పాల్ తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. కెప్టెన్ బ్రాత్‌వైట్, చందర్ పాల్ సెంచరీలతో రాణించారు. బ్రాత్‌వైట్ టెస్టులో తన 12వ సెంచరీని నమోదు చేశారు. టాగెనరైన్ చంద్రపాల్ మే 31, 1996న గయానాలోని జార్జ్‌టౌన్‌లో జన్మించాడు. ఆరు మ్యాచ్‌ల్లో 293 పరుగుల చేశాడు. 2013లో గయానా తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. ఇటీవల కాలంలో వెస్టిండీస్ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. విండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ శివనారాయణ్‌ చందర్‌పాల్‌ తనయుడైన టాగెనరైన్ చంద్రపాల్ తన తండ్రితో కలిసి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాడు.

టాగెనరైన్ చంద్రపాల్

శివనారయణన్ చంద్రపాల్ సాధించిన రికార్డులివే

శివనారయణన్ టెస్ట్ క్రికెట్‌లో 10,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఇద్దరు కరీబియన్ ఆటగాళ్లలో ఒకరు. రెండు దశాబ్దాల పాటు సాగిన కెరీర్‌లో ఈ మాజీ ఆటగాడు 51.37 సగటుతో 11,867 టెస్టు పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలున్నాయి. వన్డేలో 8,778 పరుగులు, టీ20ల్లో 343 పరుగులు చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌కు టాగెనరైన్ చంద్రపాల్ రిజర్వ్ బ్యాటర్‌గా ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. చంద్రపాల్, బ్రాత్‌వైట్ 336 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. టెస్టుల్లో ఓపెనింగ్ భాగస్వామ్యం ఇన్ని పరుగులు చేయడం వెస్టిండీస్‌కు ఇది పదోసారి. 2012లో న్యూజిలాండ్‌పై క్రిస్‌గేల్, కీరన్ పావెల్‌ల 254 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.