LOADING...
సూపర్ సెంచరీతో అదరగొట్టిన మార్కరమ్, ఫైనల్‌కు చేరిన సన్ రైజర్స్
సెంచరీతో అదరొట్టిన మార్కరమ్

సూపర్ సెంచరీతో అదరగొట్టిన మార్కరమ్, ఫైనల్‌కు చేరిన సన్ రైజర్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 10, 2023
01:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

సౌతాఫ్రికా టీ20 లీగ్-2023 ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్లో జోబర్గ్ సూపర్ కింగ్స్ ను 14 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఓడించింది. సన్ రైజర్స్‌కు చెందిన ఆ జట్టు కెప్టెన్ మార్కరమ్ అద్భుతమైన సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. కేవలం 58 బంతుల్లో మార్కరమ్ 6 సిక్స్‌లు, 6 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్‌ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. కాగా జోబర్గ్ సూపర్ కింగ్స్‌ బౌలర్లలో విలియమ్స్‌ నాలుగు వికెట్లు సాధించాడు.

సన్ రైజర్స్

ఫైనల్లో ప్రిటోరియా క్యాపిటల్స్‌తో తలపడనున్న సన్ రైజర్స్ ఈస్టర్ కేప్

214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో విజయానికి 14 పరుగుల దూరంలో సూపర్‌ కింగ్స్‌ నిలిచిపోయింది సన్‌రైజర్స్‌ జట్టులో రోలోఫ్ వాన్ డెర్ మెర్వే రెండు వికెట్లు సాధించాడు. టీ20ల్లో మార్క్‌రామ్‌ తన సత్తా చాటాడు. 2019లో శ్రీలంకపై అరంగేట్రం చేశాడు. 31 మ్యాచ్‌ల్లో 879 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది అర్ధ సెంచరీలున్నాయి. జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఫిబ్రవరి 11న జరగనున్న ఫైనల్‌ పోరులో ప్రిటోరియా క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తలపడనుంది.

Advertisement