Page Loader
SA vs WI: అర్ధ సెంచరీతో అదరగొట్టిన ఎల్గర్
ఎల్గర్ 118 బంతుల్లో 71 పరుగులు చేశాడు

SA vs WI: అర్ధ సెంచరీతో అదరగొట్టిన ఎల్గర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 01, 2023
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

వెస్టిండీస్ జరుగుతున్న తొలి టెస్టులో ధక్షిణాఫ్రికా ఓపెనింగ్ స్టార్ బ్యాటర్ ఎల్గర్ అర్ధ సెంచరీతో చెలరేగాడు. 118 బంతుల్లో 71 పరుగులు చేశాడు. తొలి వికెట్ కు మార్క్‌రమ్, ఎల్గర్ కలిసి 141 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 82 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. తనను తాను నిరూపించుకోవాల్సిన మ్యాచ్‌లో ఎల్గర్ హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం అల్జారీ జోసెఫ్ చేతిలో ఔటయ్యాడు. ఓపెనర్లు ఎల్గర్, మార్క్రమ్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి, సులభంగా పరుగులు రాబట్టారు. ఉదయం సెషన్‌లో 90 పరుగులు జోడించారు.

ఎల్గర్

టెస్టులో 23 అర్ధ సెంచరీలు సాధించిన ఎల్గర్

ఎల్గర్ టెస్టులో 23 అర్ధ సెంచరీలు చేశాడు. ప్రస్తుతం టెస్టుల్లో 37.39 సగటుతో 5,098 పరుగులు చేశాడు. స్వదేశంలో ఎల్గర్ 47.50 సగటుతో 3,230 పరుగులు చేశాడు. సొంతగడ్డపై 17వ అర్ధశతకం సాధించాడు. వెస్టిండీస్‌పై ఎల్గర్ 53.57 సగటుతో 375 పరుగులు చేశాడు. మొత్తం మీద వెస్టిండీస్‌పై 3 అర్ధ సెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ టెంబా బవుమా(0) సిల్వర్ డక్‌గా వెనుదిరగ్గా.. కీగన్ పీటర్సన్(14), హెన్రీచ్ క్లాసెన్(20) దారుణంగా విఫలమయ్యారు