దక్షిణాఫ్రికా తరుపున టెస్టులో అరంగేట్రం చేసిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు టోనీ డి జోర్జి, గెరాల్డ్ కోయెట్జీ అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఇటీవల దేశవాళీ క్రికెట్లు ఇద్దరు బాగా రాణించడంతో వాళ్లు తొలి టెస్టుకు ఎంపికయ్యాడు. బ్యాట్‌మెన్‌గా డిజోరి, రైట్ ఆర్మ్ పేసర్ గా కోయెట్టీ జట్టులో రాణించనున్నారు.
ఆగస్ట్ 28, 1997న జన్మించిన టోనీ డి జోర్జి పశ్చిమ ప్రావిన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముఖ్యంగా డి జోరీ అరంగేట్రంలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు ఎంపికయ్యాడు.
అక్టోబర్ 2016లో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసిన డి జోర్జి, ఇప్పటివరకూ 2,953 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, 12 అర్ధ సెంచరీలున్నాయి.
టెంబా బావుమా
టెస్టు కెప్టెన్‌గా టెంబా బావుమా
కోట్జీ తన ఫస్ట్-క్లాస్ అరంగేట్రం అక్టోబర్ 2019లో వారియర్స్‌తో ఆడాడు. అతను 16 రెడ్-బాల్ మ్యాచ్‌లలో 50 వికెట్లను పడగొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న CSA 4-రోజుల సిరీస్ డివిజన్ 1లో, 34.36 సగటుతో నాలుగు మ్యాచ్‌ల్లో 11 వికెట్లను తీశాడు.
ప్రస్తుతం జరుగుతున్న టెస్టు మ్యాచ్‌కు టెంబా బావుమా తొలిసారి నాయకత్వ బాధ్యతలను చేపట్టాడు.
ప్రస్తుతం ధక్షిణాఫ్రికా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఎల్గర్, ఐడెన్ మార్కర్మ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.