LOADING...
Arjun Tendulkar: అర్జున్ తెందుల్కర్ పెళ్లి వేడుకకు మోదీకి ప్రత్యేక ఆహ్వానం
అర్జున్ తెందుల్కర్ పెళ్లి వేడుకకు మోదీకి ప్రత్యేక ఆహ్వానం

Arjun Tendulkar: అర్జున్ తెందుల్కర్ పెళ్లి వేడుకకు మోదీకి ప్రత్యేక ఆహ్వానం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 11, 2026
12:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్‌ ప్రపంచంలో లెజెండ్‌గా గుర్తింపు పొందిన సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్‌ తెందుల్కర్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అతడు తన చిరకాల స్నేహితురాలు సానియా చందోక్‌తో పెళ్లి చేసుకోనున్నాడు. వీరి వివాహ వేడుక మార్చి 5న ముంబయిలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తన కుమారుడి పెళ్లికి హాజరుకావాలని కోరుతూ సచిన్‌ కుటుంబ సభ్యులతో కలిసి నరేంద్ర మోదీని మంగళవారం స్వయంగా కలసి ఆహ్వానించారు. ఈ భేటీకి సానియా తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. మోదీ వారందరినీ స్నేహపూర్వకంగా ఆహ్వానించి, కాబోయే వధూవరులను హృదయపూర్వకంగా ఆశీర్వదించారు.

వివరాలు 

ముంబయిలో 'మిస్టర్‌ పాస్‌ పెట్‌ స్పా' సంస్థను నిర్వహిస్తున్న సానియా

అనంతరం మోదీతో ఇరు కుటుంబాలు కలిసి ఫొటో దిగాయి. అంతేకాకుండా అర్జున్‌, సానియా ఇద్దరూ ప్రధానితో ప్రత్యేకంగా ఫొటో దిగారు. ఈ ప్రత్యేక క్షణాలను సచిన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సానియా చందోక్‌ ముంబయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్‌ మనవరాలు. ఆమె కూడా వ్యాపార రంగంలో స్థిరపడిన వ్యక్తే. ముంబయిలో 'మిస్టర్‌ పాస్‌ పెట్‌ స్పా' అనే సంస్థను ఆమె నిర్వహిస్తున్నారు. అలాగే, సచిన్‌ కుమార్తె సారాతో సానియాకు ఎన్నో సంవత్సరాలుగా సన్నిహిత సంబంధం కొనసాగుతోంది.

Advertisement