
Sachin Tendulkar Statue: నేడు వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కరణ.. హాజరు కానున్న ప్రముఖులు
ఈ వార్తాకథనం ఏంటి
మాస్టర్ బాస్టర్ సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఇవాళ ముంబై క్రికెట్ అసోసియేషన్ వాంఖడే స్టేడియంలో ఆవిష్కరించనుంది.
ఈ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జరగనుంది.
స్టేడియంలో సచిన్ స్టాండ్ వద్ద ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో సచిన్ తన 50వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు అరుదైన గౌరవాన్ని కల్పించారు.
ఈ కార్యక్రమానికి బీసీసీఐ సెక్రటరీ జై షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొననున్నారు.
సచిన్ తన 200వ, చివరి టెస్టును నవంబర్ 2013లో వాంఖడే స్టేడియంలో ఆడిన విషయం తెలిసిందే.
Details
సంతోషంలో మునిగిపోయిన క్రికెట్ ఫ్యాన్స్
ప్రస్తుతం వరల్డ్ కప్ టోర్నీ జరుగుతున్న సమయంలో సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తుండటంతో క్రికెట్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.
రేపు ఇదే స్టేడియంలో భారత్-శ్రీలంక మ్యాచ్ జరగనుంది.
హోం గ్రౌండ్ అయిన వాంఖడే స్టేడియంలో సచిన్ పేరిట ఎన్నో రికార్డులు నమోదయ్యాయి ఇదే మైదానంలో భారత్ 2011లో వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే.
స్టేడియంలో విగ్రహం ఏర్పాటు చేయనున్న రెండో భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మాత్రమే.
ఇప్పటి వరకు, భారత మాజీ కెప్టెన్ కల్నల్ సీకే నాయుడు విగ్రహాలు మాత్రమే మూడు వేర్వేరు ప్రదేశాలలో ప్రతిష్టించబడ్డాయి.