LOADING...
GT vs CSK: సాయి సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్.. చెన్నైపై గుజరాత్ ఘన విజయం
సాయి సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్.. చెన్నైపై గుజరాత్ ఘన విజయం

GT vs CSK: సాయి సుదర్శన్ మెరుపు ఇన్నింగ్స్.. చెన్నైపై గుజరాత్ ఘన విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 26, 2026
07:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 16.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ విజయానికి ప్రధాన కారణంగా ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుత ఇన్నింగ్స్ నిలిచింది. అతను 46 బంతుల్లో 87 పరుగులు చేసి 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో చెలరేగిపోయాడు.

వివరాలు

చైన్నై సూపర్ కింగ్స్ కు ఐదో ఓటమి

జోస్ బట్లర్ 39 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, శుభ్‌మన్ గిల్ 33 పరుగులు చేసి మంచి సహకారం అందించాడు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ 8 మ్యాచ్‌ల్లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఇది ఐదో ఓటమిగా నమోదైంది.

Advertisement