Sania mirza: దుబాయ్‌లో భయానకం..ప్రాణాలతో బయటపడ్డ సానియా!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశానికి చెందిన మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దుబాయ్‌లో అత్యంత దారుణ పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిణామాల వల్ల దుబాయ్‌లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో తన కుమారుడు ఇజాన్‌తో కలిసి సానియా సురక్షితంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల గురించి సానియా మాట్లాడుతూ.. తాను అనుభవించిన భయానక క్షణాలను వెల్లడించారు. తమ ఇంటి పైనుంచి ఫైటర్ జెట్లు ఎగిరిపోతుండగా.. వాటిని గాలిలో అడ్డుకునే ప్రయత్నాల్లో భారీ శబ్దాలు వినిపించాయన్నారు. తమ నివాసానికి కేవలం 400-500 మీటర్ల దూరంలోనే క్షిపణి శకలాలు పడ్డాయిని, ఆ దృశ్యాలను చూసినప్పుడు ఏ తల్లికైనా భయం కలగడం సహజమేనని సానియా ఎమోషనల్ అయ్యారు.
వివరాలు
ఆందోళన కలిగించిన తన బిడ్డ ప్రశ్నలు..
తన కుమారుడు ఇజాన్ గురించి సానియా మాట్లాడుతూ.. యుద్ధ వాతావరణం అతనిపై చూపిన ప్రభావాన్ని వివరించాడని, తన బిడ్డ ఎన్నో ప్రశ్నలు వేసినట్లు చెప్పింది. అలాంటి పరిస్థితులు చిన్నపిల్లలకు అసలు మంచివి కావని, వెంటనే హైదరాబాద్‌కు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. రంజాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకుని సానియా తన పుట్టింటికి వచ్చారు. ప్రతి సంవత్సరం రంజాన్ చివరి వారంలో హైదరాబాద్‌లో తాను గడుపుతానని, ఇక్కడి పండుగ వాతావరణం చాలా ప్రత్యేకంగా ఉంటుందన్నారు. తన కుమారుడికి కూడా తన తాతయ్య, అమ్మమ్మలతో గడపడం ఎంతో ఇష్టమని సానియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇజాన్‌కు పాఠశాల సెలవులు ఉండటంతో, దుబాయ్‌లో పరిస్థితులు మెరుగుపడితేనే వచ్చే వారం తిరిగి వెళ్లే అంశంపై నిర్ణయం తీసుకుంటానని సానియా స్పష్టం చేశారు.