Page Loader
అన్నా డానిలినాతో జతకట్టనున్న సానియా మీర్జా
సానియా మీర్జా

అన్నా డానిలినాతో జతకట్టనున్న సానియా మీర్జా

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 23, 2022
11:06 am

ఈ వార్తాకథనం ఏంటి

2023 జనవరి 16న ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభం కానుంది. భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రపంచ నంబర్ 11 అయిన అన్నా డానిలినాతో జత కట్టనుంది. అయితే, ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ పోటీలో పాల్గొంటానని సానియా మీర్జా ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం WTA డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా ప్రపంచంలో 25వ ర్యాంక్‌లో ఉంది. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా 2022లో WTA 500 చార్లెస్‌టన్ ఓపెన్, WTA 250 స్ట్రాస్‌బర్గ్ ఓపెన్స్లో ఫైనల్స్‌కు చేరుకుంది. అదే విధంగా ఆరు మహిళల డబుల్స్ సెమీఫైనల్స్‌లో పాల్గొంది. 2022 సీజన్ తర్వాత టెన్నిస్ ఆడటం మానేయాలని భారత్ టెన్నిస్ సానియా మీర్జా భావించింది, అయితే తర్వాత ఆమె మనసు మార్చుకుంది.

సానియా మీర్జా

2022 మిక్స్‌డ్ డబుల్స్‌లో సెమీఫైనల్‌కి చేరుకొని రికార్డు

సానియా తన క్రొయేషియా భాగస్వామి మేట్ పావిక్‌తో కలిసి వింబుల్డన్ 2022 మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్‌కు చేరుకోవడం ఆ ఏడాది రికార్డు సృష్టించింది. 36 ఏళ్ల సైనా ఐదేళ్ల తర్వాత తొలి గ్రాండ్‌స్లామ్‌ సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. సానియా తన కెరీర్‌లో రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకుంది, ఒకటి మహిళల డబుల్స్‌లో మార్టినా నవ్రతిలోవాతో, మరొకటి 2009లో మహేష్ భూపతితో మిక్స్‌డ్ డబుల్స్‌లో విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022లో, సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో నదియా కిచెనోక్‌తో జతకట్టింది. అయితే మొదటి రౌండ్‌లోనే దారుణంగా ఓడిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అమెరికాకు చెందిన రాజీవ్‌రామ్‌తో కలిసి ఆమె క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం.