
LSG: లక్నో ఫెయిల్యూర్‌పై సంజీవ్ గోయెంకా ఆగ్రహం.. ఐదుగురిపై వేటు!
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్‌ను మార్చినా, జట్టు విధిని మార్చలేకపోయింది.
గత సీజన్‌లో ఏడో స్థానంలో ముగించిన లక్నో, ఈసారి కూడా అదే స్థానం వద్ద నిలిచింది.
జట్టు కెప్టెన్‌గా రిషబ్ పంత్‌కి అవకాశం ఇచ్చినా, అతను బ్యాటింగ్‌లో కానీ, కెప్టెన్సీలో కానీ తన ప్రభావాన్ని చూపలేకపోయాడు.
మొత్తం 12 మ్యాచ్‌ల్లో కేవలం 5 విజయాలు మాత్రమే లభించాయి.
మిగిలిన 7 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూశారు. జట్టు ప్రదర్శన నేపథ్యంలో, లక్నో యాజమాన్యం కీలక మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన రిషబ్ పంత్‌పై లక్నో యాజమాన్యం భారీ ఆశలు పెట్టుకుంది.
Details
ఇతర ఆటగాళ్ల పరిస్థితి కూడా క్లిష్టమే
కానీ ఈ సీజన్‌లో అతను 12 మ్యాచ్‌ల్లో కేవలం 135 పరుగులు మాత్రమే చేసి, ఒక్క అర్ధ సెంచరీ నమోదు చేశాడు. దీంతో జట్టు అతన్ని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
కేవలం రిషబ్ పంత్ మాత్రమే కాదు, మరికొందరు ఆటగాళ్లపై కూడా క్లారిటీ లేని పరిస్థితి నెలకొంది. ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ ఈ సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడు.
గాయం కారణంగా అతను మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండలేదు. దాంతో అతని భవిష్యత్తు కూడా అనిశ్చితంగా ఉంది.
అలాగే అనుభవజ్ఞుడైన డేవిడ్ మిల్లర్ 11 మ్యాచ్‌ల్లో కేవలం 153 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
Details
ఐపీఎల్ నియమాలు ఏమంటున్నాయి?
అర్షిన్ కులకర్ణి (ఆల్‌రౌండర్), షమర్ జోసెఫ్ (వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్) వంటి ఆటగాళ్లు మొత్తం సీజన్‌లో బెంచ్‌కే పరిమితమయ్యారు. వీరిని కూడా జట్టు విడుదల చేసే అవకాశముందని వార్తలు వచ్చాయి.
ఐపీఎల్ 2026కి ముందు జరిగే మినీ వేలానికి ముందు, లక్నో యాజమాన్యం ఈ ఆటగాళ్లను విడుదల చేయవచ్చు.
విడుదలైన ఆటగాళ్ల స్థానంలో కొత్తవారిని కొనుగోలు చేయడం యాజమాన్యానికి వీలవుతుంది.
దీంతో, కెప్టెన్ సహా పలువురిని జట్టులోకి తీసుకోవాలనే యోచనలో యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది.
Details
సంజీవ్ గోయెంకా స్పందన
సీజన్ నుండి ప్లేఆఫ్ రేసు ముగిసిన తర్వాత, యజమాని సంజీవ్ గోయెంకా సోషల్ మీడియాలో స్పందిస్తూ, "ఐపీఎల్ 2025 చాలా సవాలుతో కూడుకున్నది.
ఇది మాకు ధైర్యాన్ని ఇస్తుంది. మాకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. గర్వంగా ఆడుదాం, విజయంతో సీజన్‌ను ముగిద్దామంటూ పోస్ట్ చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, వచ్చే సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం భారీ మార్పులు చేపట్టే అవకాశం ఎంతో ఉంది.